క్రికెట్ మైదానంలోకి వచ్చి ప్రత్యర్థులు వేసే బాల్లను రాకెట్ షాట్స్ కొడుతూ సిక్సులు, ఫోర్లు చేస్తూ జట్టుకు స్కోరు పెంచడంలో దిట్ట మహేంద్ర సింగ్ దోనీ. అందుకే భారత క్రికెట్ టీమ్ కి రథసారధి అయ్యాడు. కెప్టెన్ గా వరల్డ్ కప్ కూడా సాధించాడు.  


యువకుడిగా ఉన్నపుడు తన టీమ్ తో మహేంద్రసింగ్ దోని


సింగ్ దోని 1981, జూలై 7 న ఝార్ఖండ్ లోని రాంచీ లో జన్మించిన మహేంద్ర సింగ్ ధోని   భారత్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మరియు భారత వన్డే, ట్వంటీ-20, మరియూ టెస్టు జట్టుకు ప్రస్తుత కెప్టెన్. కుడి చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్ గా భారత జట్టులో రంగప్రవేశం చేసిన ధోని జూనియర్ మరియు ఇండియా-ఏ లో ప్రతిభ ప్రదర్శించి ఈ స్థాయికి వచ్చినాడు.  భారత్-ఏ తరఫున ఆడుతూ పాకిస్తాన్-ఏ పై సెంచరీలు సాధించి తన ప్రతిభను వెల్లడించి అదే సంవత్సరంలో భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2005 లో పాకిస్తాన్ పై 5 వ వన్డే లో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అదే సమయంలో శ్రీలంక పై 183 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు. ఇది భారత్ తరఫున వన్డేలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా టి20 మరియూ ప్రపంచకప్ 2011 లొ భారత్ ను విజయపధాన నిలిపినాడు.


 

కుటుంబ సభ్యులతో సింపుల్ గా కనబడుతున్న భారత్ క్రికెట్ కెప్టెన్ మహీంద్ర 


2003 లో వరల్డ్ కప్ జరిగే సమయంలో దోనీ జంషెడ్ పూర్ లో రైల్వే డిపార్టు మెంట్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేసేవాడు. అప్పుడు కెన్యాతో ఇండియా మ్యాచ్ ఆడుతున్న సమయంలో తన సీనియర్ ఉద్యోగులు ఒక రూమ్ లో కూర్చుని టీవిలో మ్యాచ్ సీరియస్ గా చూస్తున్నారు. అప్పుడు దోని వారి వద్దకు వెళ్లి స్కోర్ ఎంత అంటూ అమాకంగా అడిగాడు.  అప్పుడు అక్కడున్న ఉద్యోగి వ్యంగంగా నువ్ స్కోర్ తెలుసుకొని ఏం చేస్తావ్ ..? నువ్వు ఏమైనా అక్కడకెళ్లి ఆడతావా అంటూ నవ్వారు. దోని ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లి పోయాడు. ఆ వెళ్లిన వాడే ఇప్పుడు క్రికెట్ యోధుడు అయ్యాడు. భారతీయులు అభిమానించే స్టార్ క్రికెటర్ అయ్యాడు. భారత జట్టుకు కెప్టెన్ కూడా అయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: