అకృత్యాలు హెచ్చుమీరుతుండటంపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ తనదైన శైలిలో స్సందిచారు. ఆడవాళ్లను నీచంగా చూస్తూ, వేధింపులకు పాల్పడే మగవాళ్లు రాక్షసులుగా మారతారని వ్యాఖ్యానించారు. మహిళల రక్షణపై ఎంటీవీ రూపొందిస్తున్న 'ముక్తి' అనే కామియో టీవీ షోలో నటిస్తోన్న ఆమె.. శుక్రవారం మీడియాతో పలు అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.'


స్త్రీని చిన్నచూపు చూసే భారత్ లాంటి సమాజంలో ఇదివరకెప్పుడూ జీవించలేదు! నేను పుట్టి పెరిగిందంతా విదేశాల్లోనే! ఇక్కడి మగవాళ్లందరికీ నాదొక విన్నపం.. మీరు సిటీలో ఉండొచ్చు లేదా గ్రామాల్లో ఉండొచ్చు కానీ మగువల స్వేఛ్చను హరించాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆ భావనే మిమ్మల్ని రాక్షసుడిగా మార్చేస్తుంది' అని హితవుపలికారు.తానేంటో నిరూపించాలనుకునే ప్రతి మహిళకు తనకు తానే ఆధారంగా ఉండాలని సన్నీ అన్నారు. ఆడవాళ్లతో ఎలా మెలాగాలన్నది తల్లిదండ్రుల పెంపకం నుంచే మొదలవుతుదని, మెరుగైన విద్యావిధానంతో మంచి ఫలితాలుంటాయన్న ఆమె.. తన సూచనల్ని ఆచరిస్తే యువతలో మార్పు తథ్యం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: