తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్-లో వర్గపోరు మొదలైంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు వర్గీయుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కొత్తగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు స్వాగత కటవుట్లు ఏర్పాటు చేశారు. వాటిని జలగం వర్గీయులు పీకేశారు. ఈ చర్యను తుమ్మల వర్గీలు అడ్డుకున్నారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. తుమ్మల వర్గీయుడు కృష్ణమోహన్-పై కొందరు చేయిచేసుకున్నారని 3 టౌన్ పోలీస్ స్టేషన్-లో జలగం వర్గంపై ఫిర్యాదు నమోదైంది. సీఎం కేసీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళి, భద్రాచలంలోనే రాత్రికి బస చేస్తారు. శనివారం ఉదయం పది గంటలకు భద్రాద్రి రాముడి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం తర్వాత మణుగూరులో థర్మల్ పవర్ ప్లాంట్-ను ఆయన ప్రారంభిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: