తిరుమల తిరుపతి దేవస్థానం 2015-16 వార్షిక బడ్జెట్-ను టీటీడీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. మొత్తం 2,530 కోట్లతో ఈ వార్షిక బడ్జెట్-ను రూపొందించారు. ఇందులో హిందూ ధర్మ ప్రచార పరిషత్-కు రూ.118 కోట్లు, టీటీడీ విద్యా సంస్థలకు రూ.94.45 కోట్లు కేటాయిస్తూ వార్షిక బడ్జెట్-లో ప్రతిపాదించారు. దాంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత కోసం మరో రూ.109 కోట్లు కేటాయించారు. టీటీడీ భద్రతకు రూ.55.88 కోట్లు, టీటీడీ పరిధిలోని ఆస్పత్రుల నిర్వహణకు రూ.62.81 కోట్లు, టీటీడీ ఇంజినీరింగ్ విభాగానికి రూ.150 కోట్లు కేటాయిస్తూ అధికారులు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: