యాంకర్ సుమ.. బుల్లితెరపై ఈమె చేసే అల్లరి అందరికీ సుపరిచితమే. దశాబ్దాల తరబడి యాంకర్ గా సక్సస్ ఫుల్ గా నెట్టుకురావడంలో సుమ తర్వాతే ఎవరైనా.. హీరోయిన్, యాంకర్ ఈ రెండింటిలో సుమ యాంకరింగ్ ఎంచుకుని.. అద్వితీయంగా రాణిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సుమ యాంకరింగ్ ఉంటే చాలు.. ఆ ప్రోగ్రామ్ హిట్టే అనే టాక్ సొంతం చేసుకున్నారు. 

యాంకరింగ్ లోనూ ఎక్స్ పోజింగ్ వచ్చేస్తున్న ఈకాలంలోనూ తన హోమ్లీ, జోవియల్ బిహేవియర్ తో అందరినీ ఆకట్టుకుంటోంది సుమ. తాజాగా సుమ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ చోటు సంపాదించుకుంది. దేశంలోనే అత్యధిక గేమ్ షో ఎపిసోడ్లు నిర్వహించిన యాంకర్ గా చరిత్ర సృష్టించారు. ఈటీవీ స్టార్ మహిళ కార్యక్రమంతో ఆమె ఈ క్రెడిట్ సొంతం చేసుకున్నారు. 

తన ఛానళ్ల ద్వారా ఎందరికో కొత్త అవకాశాలు కల్పించే రామోజీరావు.. సుమ రికార్డుపై చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఆయన స్టార్ మహిళ టీమ్ ను ఫిలింసిటీలోని తన కార్పొరేట్ ఆఫీసుకు పిలిపించుకుని.. లిమ్కా బుక్ పత్రాన్ని స్వయంగా సుమ చేతికి అందించారు. సుమ భాషా పటిమ, సమయ స్ఫూర్తిపై రామోజీ ప్రశంసల జల్లు కురిపించారట. 

తెలుగు, తెలుగుదనానికి పెద్ద పీట వేసే రామోజీ.. సుమ యాంకరింగ్ ను బాగా మెచ్చుకున్నారట. అంతేకాదు.. సుమను తెలుగు భారతి అంటూ వర్ణించారట. ఈ కార్యక్రమానికి ఈటీవీ సీఈవో బాపినీడు, మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి కూడా హాజరయ్యాట. నిజంగా ఓ యాంకర్ సంవత్సరాల తరబడి.. ఒకే కాన్సెప్టుతో గేమ్ షోను రక్తికట్టించడం సాధారణ విషయం కాదు.. కదా.. హాట్యాఫ్ టు సుమా.. కీపిటప్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: