జైల్లో ఉన్న జగన్ ను ఎవరెవరు కలుస్తున్నారు? జైల్లో పరిదికి మించి జగన్ ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారా? ములాఖత్ పేరుతో గంటలకొద్దీ అనుచరులు, పార్టీ నేతలతో జగన్ మంతనాలు జరుపుతున్నారా? జగన్ జైలు విషయం ఇప్పుడు టీడీపీ అస్ర్తంగా చేసుకోవడానికి రెడీ అవుతోంది.  జగన్ జైలుకెళ్లి వందరోజుల దాటింది. రోజుకొకరి చొప్పున ములాఖత్ లో కలుస్తూనే ఉన్నారు జగన్. జైల్లోనే పార్టీ ముఖ్య నేతలో మంతనాలు సాగిస్తున్నారు. ఖైదీనంబర్ 6093.. ఇది జగన్ నంబర్. ఇప్పటి వరకూ దీని మీద 134 ములాఖత్ లు నమోదయ్యాయి. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిలా.. జగన్ ను ఎక్కువ సార్లు కలసివారిలో ఉన్నారు. వీరితోపాటు పార్టీనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు జగన్ ను కలుస్తూనే ఉన్నారు. కర్నాటక నుంచి కొంతమంది వచ్చి జగన్ ను కలుస్తున్నారు. బెయిల్ ఫర్ సేల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు కూడా జగన్ ని కలసిన వారిలో ఉన్నారు. సాధారణంగా వారానికి రెండు కంటే ఎక్కువ ములాఖత్ లు ఇవ్వకూడదు. కానీ జగన్ ను ఇప్పటి వరకూ 134 మంది ఎలా కలిసారనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. జైల్లో ఇతర ఖైదీలను కలవడానికి వచ్చే వారు సైతం జగన్ ను కలుస్తున్నారు. వారి వివరాలు అధికారుల రికార్డుల్లో లేవు. అరగంట కంటే ఎక్కువ సేపు ఖైదీని కలిసే చాన్స్ ఉండదు. కానీ జైల్లో కొందర నేతలు గంటల కొద్దీ జగన్ తో సంభాషిస్తుంటారు. ఇంత మంది తో ఎప్పటి కప్పుడు కలుస్తున్న జగన్ వారితో ప్రతి విషయాన్ని చర్చిస్తున్నారు. ఈ విషయాలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎనమాల రామకృష్ణుడు ఆర్టీ ఐ నుంచి సేకరించారు. వీటిని బయటపెట్టిన టీడీపీ చేతికి ఓ అస్త్రం దొరికినట్లైంది. ములాఖత్ కి వెళ్లే వ్యక్తి సెల్ ఫోన్ తో లోపలికి వెళ్తున్నారని మరికొన్ని వివరాలు తమ దగ్గరున్నట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరి ఈ ఆధారాల అస్త్రాన్ని టీడీపీ ఏ విధంగా ఉపయోగించబోతోందో.. దానికి జగన్ పార్టీ ఎలా రెస్పాన్స్ అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: