ఎపి శాసనసభ సమావేశాలలో టిడిపి ఎమ్మెల్యేలు పాతికమందే చురుకుగా వ్యవహరించారని టిడిపి పర్యవేక్షక కమిటీ అబిప్రాయపడింది.శాసనసభలో పనితీరు పరిశీలనకు మంత్రి అచ్చెన్నాయుడు, ఛీఫ్ కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కేశవ్, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర,మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ లతో కమిటీ ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రోజువారి సభ్యుల పనితీరును మదించి నివేదిక తయారు చేసింది.

దాని ప్రకారం పాతిక మందే చురుకుగా సబలో పాల్గొన్నారు.స్పీకర్ పై విపక్షం విమర్శలు చేసినప్పుడు కాని ,పోడియంలోకి వెళ్లినప్పుడు సీనియర్ సబ్యులు పట్టించుకోలేదని అభిప్రాయపడింది. కొందరు సభ్యలు విషయ పరిజ్ఞానం ఉన్నా భావ వ్యక్తికరణ మెరుగుపడాలని భావించారట. ఇంతకీ పనితీరు అంటూ విపక్షంపై దాడి చేయడమా?లేక ప్రభుత్వం గురించి ప్రచారం చేయడమా?పాతిక మంది మాత్రమే వీరి పరీక్షలో పాస్ అయ్యారంటే మరి మిగిలినవారి సంగతేమిటి?

మరింత సమాచారం తెలుసుకోండి: