హిట్‌ అండ్‌ రన్‌ కేసులో తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఆధారాలు అవాస్తవ మైనవని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ కోర్టుకు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో తాను కారును నడపలేదని, బారులో గ్లాసు నీటిని మాత్రమే తాగానని చెప్పారు. 2002 సెప్టెంబరు 28 తెల్లవారుజామున సబర్బన్‌ బాంద్రా ప్రాంతంలోని ఒక బేకరీలోకి ఖాన్‌ కారు దూసుకు పోయింది. ఆ సమయంలో పేవ్‌మెంట్‌పై నిద్రి స్తున్న వారిలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. తాను ప్రమాద ఘటనకు కొద్దిసేపటి ముందు మద్యం తీసుకున్నానన్న ప్రాసిక్యూషన్‌ వాదనను ఆయన తిరస్కరించారు. తన డ్రైవర్‌ అశోక్‌ సింగ్‌ కారు నడుపుతున్నాడని జడ్జి డి.డబ్ల్యు. దేశ్‌పాండే అడిగిన ప్రశ్నకు నలబై తొమ్మిదేళ్ల ఖాన్‌ సమాధానమిచ్చారు. తెల్ల చొక్కా, నీలం డెనిమ్‌ రంగు జీన్స్‌ ప్యాంట్‌ ధరించి సల్మాన్‌ కోర్టుకు హాజరయ్యారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, సెక్షన్‌ 313 కింద మోపబడిన కేసులో సల్మాన్‌కు సమన్లు జారీ చేయడంతో స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు ఆయన కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి ఆయనను 418 ప్రశ్నలు అడిగారు. కారును ఖాన్‌ నడుపుతు న్నారని, ఆ సమయంలో మద్యం తాగి ఉన్నారని ప్రాసిక్యూషన్‌ వాదించగా, దానిని ఆయన తిరస్క రించారు. ఈ కేసులో ఏమి చెప్పదలచుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, తనను పరీక్షించాలని కోరడం లేదని, డిఫెన్స్‌ ఆధారాలను పరీక్షిం చాలని విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వన్నీ తప్పుడు సాక్ష్యాలన్నారు. ఘటనకు ముందు తన సోదరుడు సోహైల్‌ ఖాన్‌, స్నేహితులతో కలసి బార్‌కు వెళ్లి మద్యం తాగినట్లు చేస్తున్న వాదనను వ్యతిరేకిం చారు.

తాను ఒక గ్లాసు మంచినీటిని మాత్రమే బార్‌లో తాగానని ఖాన్‌ తెలిపారు. తన రక్తాన్ని పరీక్షించిన బాలాశంకర్‌ నిపుణుడు కాదని ఖాన్‌ అన్నారు. గతంలో బాలాశంకర్‌ కోర్టులో ఖాన్‌ రక్తంలో 62 మిల్లీ గ్రాముల ఆల్కహాల్‌ను గుర్తించామని తెలిపారు. ఇది అనుమ తించినదానికంటే ఎక్కువ మోతాదే..అంటే ఆ సమ యంలో ఖాన్‌ మద్యం తీసుకున్నట్లు అర్థమవుతోంది. రక్త పరీక్షకు సరైన మార్గదర్శకాలను సైతం అను సరించలేదని రసాయన విశ్లేషకుడు తెలిపారన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సంబంధించిన మూడు ఫొటోలను ఖాన్‌కు చూపించగా వాటిని ఆయన గుర్తించారు. ఈ ఫొటోలను గతంలో ప్రాసిక్యూషన్‌ కోర్టుకు అందజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: