భూ సేకరణ బిల్లుపై చర్చలకు సిద్ధమేనంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ అధ్యక్షురాలు తోసిపుచ్చుతూ, యుపిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఏకపక్షంగా రైతు వ్యతిరేక చట్టాన్ని బలవంతంగా రుద్దిన తర్వాత చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఏకాభిప్రాయ సాధన ప్రక్రియను అవహేళన చేయడమేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాసిన లేఖకు శుక్రవారం ఇచ్చిన సమాధానంలో సోనియా గాంధీ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. భూ సేకరణ బిల్లును వ్యతిరేకించే వారినందరినీ దేశ ద్రోహులుగా ప్రభుత్వం చిత్రీకరించడాన్ని సోనియా తప్పుబట్టారు. రైతులు దేశానికి వెనె్నముక అని ఆమె అంటూ, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే ఏ చట్టాన్నీ కాంగ్రెస్ సమర్థించబోదని స్పష్టం చేసారు. అంతేకాక యుపిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ సేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: