ఈ విషయం చెప్పుకోవడానికే సిగ్గుచేటు అనిపిస్తుంది. దేశంలో మహిళలు, యువతులు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కఠినంగా శిక్షించాడానికి చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఆ చట్టానికి సంబంధించిన అక ఉద్యోగే చట్ట వ్యతిరేక పని చేశాడు. అభం శుభం తెలియని బాలికపై అత్యాచారం చేశాడు.


వివరాళ్లోకి వెళితే.. మెదక్ జిల్లా శింపేటలో ఒక బాలికపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి ఒడిగట్టాడు.  సదరు వ్యక్తి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హరి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు అతగాడి పేరు హరి. ఆడవారిని రక్షించాల్సిన ఉద్యోగంలో ఉంటూ నిచమైన పని చేశాడు. బాలిక తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న సదరు పోలీస్ కానిస్టేబుల్ కి ఆమె కూతురు పై కన్ను పడింది. సమయం కోసం ఎదురు చూస్తున్న అతడికి ఆ బాలిక ఒంటరిగా దొరికింది అంతే తన కామ వాంచ తీర్చుకున్నాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: