భద్రచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం   మిథిలా స్టేడియంలో అభిజిత్‌ లగ్నంలో సీతారాముల కల్యాణం రంగరంగ వైభవంగా జరిగింది.  అంతకు ముందు శనివారం మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి వూరేగింపుగా వేంచేస్తారు.

భద్రచలమున కొలువై ఉన్న శ్రీ సీతారాములు 


 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్‌ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామ నామ స్మరణతో భద్రాచలం మారుమోగింది. రాములోరి కళ్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.


 సీఎం కేసీఆర్ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పిస్తున్న దృశ్యం

జగత్ రక్షకుడు  సీతారాముని కళ్యాణం చూడటానికి రెండు కళ్లూ సరిపోవు.  సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాద్రి భక్త జనసంద్రమైంది. సాధారణ భక్తులతో వీఐపీలు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ శాసన మండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు కూడా కల్యాణోత్సవానికి హాజరయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: