ప్రపంచకప్ లో ఇండియన్ టీమ్ సెమీ ఫైనల్ లో ఓడటంతో టీమిండియాలోని ప్లేయర్ల ఆటతీరుపై చర్చ జరగాల్సింది పోయి.. కేవలం అనుష్కశర్మ మీద మాత్రమే జరుగుతోంది. జట్టులోని కీలక ఆటగాడు విరాట్ కొహ్లీకి ప్రేయసి అయిన అనుష్కపై అనేక మంది దుమ్మెత్తిపోస్తున్నారు. అక్కడికి ఆమె దగ్గరుండి టీమిండియాను ఓడించినట్టుగా అనేక మంది ట్వీట్ చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య కొంతమంది అనుష్కకు అనుకూలంగా వాయిస్ వినిపిస్తుండటం కూడా జరుగుతోంది.


 
టీమిండియా ఓటమికి, అనుష్కకు ముడిపెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్న వారిలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్ కూడా ఒకరు! భారత టీమ్ సెమిఫైనల్ లో ఓడిపోవడానికీ, అనుష్క శర్మకు ముడిపెట్టడం సరికాదని గంగూలీ తేల్చాడు. ఈ విధంగా విధంగా ఈ మాజీ కెప్టెన్ విరాట్ గర్ల్ ఫ్రెండ్ ను వెనకేసుకొచ్చాడు.


 
అయితే తను టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న రోజుల్లో ఇలా గర్ల్ ఫ్రెండ్ ను మెయింటెయిన్ చేసిన ఘనత ఉంది గంగూలీకి. అప్పట్టో ఈయనకు నగ్మాతో సాన్నిహిత్యం ఉండేది. చాలా మ్యాచ్ లకు నగ్మా వీక్షకుల గ్యాలరీలో కనిపించేది. మీడియాలో వీరిద్దరి సాన్నిహిత్యం బాగా పాపులర్ అయ్యింది. అప్పటికే పెళ్లి అయిన గంగూలీ నగ్మాతో కలిసి కొన్ని దేవాలయాలను సందర్శించాడు. ఎప్పుడైన మ్యాచ్ లో బెంగాల్ టైగర్ ఫెయిలయ్యాడంటే.. నగ్మాను నిందించడం మొదలైంది!


 
వికెట్ల వద్ద నగ్మా ఫోటోను పెడితే గంగూలీ బాగా రన్స్ తీస్తాడనే కామెంట్లు వినిపించాయి. ఒక సీరియస్ లో అయితే గంగూలీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆడమ్ గిల్ క్రిస్ట్ దగ్గరకు వచ్చి 'హౌ ఈజ్ నగ్మా' అంటూ టీజ్ చేస్తూ కెప్టెన్ కాన్సన్ ట్రేషన్ ను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అలా గర్ల్ ఫ్రెండ్ చరిత్రను కలిగిన గంగూలీ ఇప్పుడు టీమిండియాలో గర్ల్ ఫ్రెండ్ ను కలిగిన విరాట్ ను వెనకేసుకురావడం ఆసక్తికరమైన అంశమే! 


మరింత సమాచారం తెలుసుకోండి: