కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ ఎంపీలే కొంచెం బెటరేమో అనిపిస్తోంది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీరును చూస్తుంటే. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో అనేక మంది తెలుగు ఎంపీలు సోనియాను కీర్తించేవారు. ఆమెను దేవతగా పొగిడే వారు. ఈ విషయంలో కొంతమంది కాంగ్రెస్ లీడర్ల మధ్య గట్టి పోటీనే జరిగేది. తమ రాజ్యసభ సభ్యత్వాల కోసం.. ఇతర పదవుల కోసం కాంగ్రెస్ నేతలు సోనియాను పొగడ్తల్లో ముంచెత్తే వారు.

వైఎస్ ను శరణుజొచ్చడమా.


ముఖ్యమంత్రిగా వైఎస్ ధాటికి తట్టుకోలేని వాళ్లు.. వైఎస్ ను శరణుజొచ్చడమా.. లేక సోనియాను కీర్తించడమా.. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక వైఎస్ మరణించాకా అయితే.. కిరణ్ ను ఇష్టానుసారం తిట్టే వాళ్లు తయారయ్యారు. అలాంటి వారందరికీ సోనియానే ధైర్యం. సోనియాపై, గాంధీల కుటుంపై వీరవిధేయతను చాటుకొంటూ వాళ్లు కాలం గడిపేవాళ్లు.

వెంకయ్యనాయుడు

Image result for venkaiah naidu

కాంగ్రెస్ హయాంలో అలాంటి నేతలను ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. మోడీని పొగడటం అనే అంశంలో ఈయన కు హద్దేలేకుండా పోతోంది. అవకాశం దొరికినా పొడుగుతున్నాడు.. అవకాశం లేకపోయినా ఈయన మోడీ భజన అందుకొంటున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తరపున తిరుపతిలో జరిగిన విద్యాసంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో మోడీని ఆకాశానికెత్తేశాడు వెంకయ్యనాయుడు.

మోడీ తోపు అని తురుము అని 

Image result for narendra modi

ప్రపంచం ఇప్పుడు మోడీవైపు చూస్తోందని వెంకయ్య చెప్పుకొచ్చాడు. మోడీ తోపు అని తురుము అని సమర్థుడు అని.. అనితరసాధ్యుడు అని వెంకయ్య వ్యాఖ్యానించాడు. మరి ఇప్పటి వరకూ  ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోమోడీ తేల్చింది ఏమిటో వెంకయ్య చెప్పనే లేదు! హుదూద్ వంటి తుపాను విషయంలో కూడా కేంద్రం విదిల్చింది ముష్టిమాత్రమే. రాజధాని వంటి అంశాల గురించి ఇప్పటి వరకూ మోడీ మాట మాత్రమైన స్పందించలేదు! ఇలాంటి పరిస్థితుల్లో వెంకయ్య ఏపీ జనాల మధ్య మోడీ తన వీరవిధేయతను చాటుకొనేలా పొగడటం చాలా కామెడీగా ఉంది. జనాలు వెంకయ్య పొగడ్తలను వింటారు కానీ.. మోడీ ఏపికి చేసిందేమిటీ, చేస్తోంది ఏమిటి.. అనే విషయాల గురించి కూడా ఆలోచిస్తారు కదా! అప్పుడు వెంకయ్య పొగడ్తలు ఒట్టిభజన మాత్రమే అనిపించవా? ఈ ఆలోచన వెంకయ్య లేదా?!



మరింత సమాచారం తెలుసుకోండి: