ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో భారతీయుల మద్దతు ఆడుగుతున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ మెక్ కల్లమ్. ఆదివారం జరిగే మ్యాచ్ లో భారతీయులు తమ జట్టుకు మద్దతు పలకాలని కోరుతూ ఆయన ఒక ను కూడా ఆన్ లైన్ లో విడుదల చేశాడు. ఆస్ట్రేలియాలోపి మెల్ బోర్న్ లో జరిగే  మ్యాచ్ లో స్థానిక భారతీయులు పెద్ద ఎత్తున మైదానానికి వచ్చి తమకు మద్దతు పలకాలని మెక్ కోరాడు. సెమిఫైనల్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో చిత్తు కావడంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రపంచకప్ పై ఆసక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కివీ కెప్టెన్ ఇండియన్స్ మద్దతు కోరుతుండటం విశేషం!


ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాను సపోర్టు చేయడానికి భారతీయులు పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా వెళ్లారు. త్రివర్ణ పతాకాలు చేతబూని మైదానాల్లో 'డోంట్ గివ్ ఇట్ బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలు ఫలితాన్ని ఇవ్వలేదు. సెమిస్ లో టీమిండియా ఓటమి పాలయ్యింది.  ఈ నేపథ్యంలో ఫైనల్ పై చాలా వరకూ ఆసక్తి తగ్గింది. అయితే మనసులో మాత్రం ఫైనల్ ఇండియన్లు న్యూజిలాండ్ ను సపోర్టు చేస్తున్నారు.


సెమిస్ లో టీమిండియాను ఓడించిన ఆసీస్ ఫైనల్ లో ఓడిపోవాలనే కసి ఒకటైతే.. ఇంత వరకూ ప్రపంచకప్ గెలవని న్యూజిలాండ్ ఈ సారి గెలిస్తే బాగుంటుందని ఆశించేవారు మరికొందరు. ఆసీస్ ఇప్పటికే చాలా ప్రపంచకప్ లను గెలిచేసింది. 1987, 99, 2003,2007లలో ఆస్ట్రేలియానే విశ్వవిజేతగా నిలిచింది. అయితే కివీస్ మాత్రం తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది. ఇంతవరకూ సెమిస్ గేటు దాటని కివీస్ స్వదేశంలో జరుగుతున్న ట్రోఫీలో ఫైనల్ కు చేరింది.


ఈ నేపథ్యంలో కివీస్ ఇప్పుడు గెలవగలిగితే గెలిచినట్టు లేకపోతే మళ్లీ ఇలాంటి అవకాశం రాదు. ఇండియా ఫైనల్ కు చేరుతుందని చెప్పి చాలా మంది టికెట్లు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు. అలాంటి వారు మైదానానికి రావాలని.. తమకు సపోర్టు ఇవ్వాలని కివీ కెప్టెన్ కోరుతున్నాడు. సెమిఫైనల్ సమయంలో కూడా కివీ కెప్టెన్ ఇలాగే ఒక లేఖ విడుదల చేశాడు. టీమ్ కు మద్దతు పలకడానికి అనుకూలంగా న్యూజిలాండ్ లో ఆఫీసులకు సెలవులు ఇవ్వాలని ఆయన కోరాడు. ఇప్పుడు భారతీయుల మద్దతు కోసం మరో లేఖ రాశాడు. మనోళ్ల మద్దతు అయితే న్యూజిలాండ్ కే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు! 



మరింత సమాచారం తెలుసుకోండి: