ఆప్ లో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అటు రెబల్ నేతలు, ఇటు కేజ్రీ వర్గీయుల మద్య మాటల యుద్ధానికి పుల్ స్టాప్ పడటం లేదు. ఈ ఇష్యూకు ఎండ్ కార్డ్ పడుతుందన్న ఒక్క రోజు ముందే కేజ్రీవాల్ ఆడియో టేప్ ఇష్యూ హల్ చల్ చేసింది. ఆప్ వారణాసీ నాయకుడు ఉమేష్ కుమార్ యాదవ్ తో కేజ్రీవాల్ మాట్లాడిన ఆడియో వాయిస్ ను హైలెట్ చేస్తున్నారు రెబల్ లీడర్స్. ఆ టేపులో కేజ్రీవాల్ తమపేర్లు ప్రస్తావనకు తీసుకోచ్చారని వారు ఆరోపించారు. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. అటు కేజ్రీ వర్గీయులు ఈ కామెంట్స్ ను కొట్టిపారేస్తున్నారు. కేజ్రీవాల్ పరువు తీయడానికి  ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు ట్రై చేస్తున్నారంటున్నారు ఆప్ నేతలు. అయినా కేజ్రీవాల్ కు బూతులు రావన్నారు.

ఈ ఇష్యూ ఇలా ఉంటే ఆప్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కీలక సమావేశం ఇవాళ జరుగనుంది. రెబల్ లీడర్స్ ప్రశాంత్ భూషన్, యోగీంధ్ర యాదవ్ ల డిమాండ్ల పై డిస్కస్ జరుగనుంది. అయితే ఇప్పటికే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన ఈ రెబల్ లీడర్స్ పై వేటు వేయడమే బెటరనే  డెసిషన్ కొచ్చినట్టు తెలుస్తోంది.

అంత సీన్ లేదంటున్నారు రెబల్ లీడర్స్. పార్టీ పదవులనుంచి తప్పిస్తారేమో కాని పార్టీ నుంచి తమను తీసివేసే దైర్యం లేదన్నారు. ఒక వేళ అదే జరిగితే పార్టీ సిద్దాంతాలకే అర్ధం ఉండదన్నారు.  అంతర్గత ప్రజాస్వామ్యం, లోక్ పాల్ బిల్లు, డిసిప్లిన్ లాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చే ఆప్ అలా చేస్తుందనుకోవడం లేదన్నారు ఆప్ రెబల్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: