తెలంగాణ సీఎం కేసీఆర్ కు పొలిటికల్ కష్టాలు మొదలైనట్టే కనిపిస్తోంది. ఉన్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఒక దాంట్లా ఘోర పరాజయం పొందటం.. మరో దాంట్లో చచ్చీ చెడీ గెలిచామనిపించుకోవడం తగ్గుతున్న టీఆర్ఎస్ ప్రభకు ఉదాహరణలు భావించొచ్చు. అందులోనూ ఉద్యమ నేతను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినా.. మంచి ట్రాక్ రికార్డు ఉన్నా.. దేవీప్రసాద్ ఓడిపోవడం టీఆఎస్ పై పెరుగుతున్న వ్యతిరేకతకు గుర్తుగానే చెప్పుకోవాలి. 

తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడానికి అన్ని ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ నాయకులు.. ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త నినాదం అందుకుంటున్నారు. ఏదో సమర్థించుకోవాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడినా.. దాన్ని నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. అందులోనూ ఫిరాయింపులను పదే పదే ప్రోత్సహించిన టీఆర్ఎస్.. అనైతికత గురించి మాట్లాడటం పెద్ద వింతే. 

వాస్తవానికి బీజేపీ గెలుపులో ఆ పార్టీ నాయకుల కృషి కూడా అంతగా లేదట. ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డే అంతగా సహకరించలేదని టాక్. అయినా ఫలితం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చిందంటే.. ఆ పార్టీ పాలనపై విద్యావంతుల వ్యతిరేకత అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కేసీఆర్ కు ముందు ముందు గడ్డు రోజులు తప్పవు మరి. ముందు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. కేసీఆర్ కు ముందుంది మొసళ్ల పండుగే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: