హైదరాబాద్ నుంచి ఇద్దరు అమ్మాయిలు క్రీడారంగంలో ప్రపంచాన్ని ఏలుతున్నారు. సానియా మిర్జా, నైనా సెహ్వల్ . ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్ చేరడం ద్వారా లీ జురుయ్‌ను రెండోస్థానానికి నెట్టింది. ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు పురుషుల విభాగంలో ప్రకాష్ పదుకొనేకు వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ లభించింది. ఈఏడాది చైనా ఓపెన్‌ను కైవసం చేసుకొని, ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకొని సంచలనాలు సృష్టించిన సైనా మరోసారి సత్తాచాటింది. 


సానియా మిర్జా : భారత బాడ్మింటన్ స్టార్




హైదరాబాద్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్

హైదరాబాద్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన భారత తొలి  క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ ర్యాంక్‌ను గురువారం అధికారికంగా ప్రకటిస్తారు.


ప్రకాశ్ పదుకొనే

దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే (1980) తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నది సైనానే కావడం విశేషం. 

ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన హైదరాబాద్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ నిండా సైనా మానియా కనిపిస్తోంది. పలు వర్గాల ప్రజలు ఆమెను అభినందిస్తున్నారు.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్విట్టర్ ద్వారా సైనాను అభినందించారు. ''ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన సైనా నెహ్వాల్ కు అభినందనలు. ఆమెకు ఈ గౌరవం రావాల్సిందే. ఇండియన్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచ్  సందర్భంగా శుభాకాంక్షలు'' అని రాష్ట్రపతి ప్రణబ్ తన ట్వీట్ ద్వారా చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: