ఆసీస్ బౌలర్ల ముందు న్యూజిలాండ్ చేతులెత్తేసినట్లే అయ్యింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొట్టమొదటే తప్పటడుగులు వేసింది. కెప్టెన్ డక్ ఔట్ అయ్యాడు. కేవలం  స్కోరు 39 పరుగులు వద్ద ఉండగా బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ జాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ ఒక ఫోరు సాయంతో 12 పరుగుల వద్ద కోల్పోయారు. అప్పటికి స్కోరు 12.2 ఓవర్లలో 39 పరుగులు. ఓపెనర్ గుప్తిల్ రూపంలో కివీస్ తన రెండో వికెట్‌ను కోల్పోయారు.

వరల్డ్ కప్ 2015 ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్


మ్యాక్స్‌వెల్ వేసిన అద్భుతమైన బంతి వికెట్లను గీరాటేసింది. దీంతో ఓపెనర్ గుప్తిల్ 15 వరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. టోటల్ గా  ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 183 పరుగులు చేసి ప్రత్యర్థి ఆస్ర్టేలియా ముందు 184 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ వెన్ను విరిచిన ఆసీస్‌ బౌలర్లు వారిని వెంటవెంటనే పెవిలియన్‌కు పంపి భారీ స్కోరు నమోదు కాకుండా చూశారు.


న్యూజ్ లాండ్ ఆటగాడు ఔట్ కాగానే వికట్ట హాసం చేస్తున్న ఆసిస్ క్రీడాకారులు

Grant Elliott Australia send off

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఇలియట్‌(83), టేలర్‌(40) మినహా మిగతావారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ఫలితంగా 183 పరుగులకే న్యూజిలాండ్‌ చాపచుట్టేసి బలమైన ప్రత్యర్థి ముందు అతితక్కువ లక్ష్యాన్ని ఉంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: