టీడీపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీని ఢీ కొట్టాలనుకున్న టీడీపీకి అనుకోని షాక్ తగిలింది. అధికారపార్టీ పక్కా ప్లాన్ ముందు బొక్కబోర్లా పడింది. 14 రోజుల సభలో ఫస్ట్ డేనే వేటుకు గురైంది. దీంతో సభ భయటే నిరసనలు, ర్యాలీలతో సరిపెట్టుకున్నారు తమ్ముళ్లు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గోడువెల్లబోసుకున్నా పట్టించుకునేవారే లేకపోయారు.

అసెంబ్లీ చాయిస్ మిస్ అయినా MLC ఎన్నికల ఫలితాలు టీడీపీకి బూస్ట్ ఇచ్చాయి. మిత్రపక్షమైన బీజేపీకి ఒక్కసీటు దక్కడంతో సిచ్యుయేషన్ ను ప్లస్ గా మార్చుకోవాలని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికార పార్టీని టార్గెట్ చేసి జనంలోకి వెళ్లాలని డిసైడయ్యారు. సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు ఇదే రైట్ టైం అని భావిస్తున్న లీడర్లు ఇందుకోసం త్వరలోనే అన్ని జిల్లాలను చూట్టేయాలని డిసైడయ్యారు. ఇప్పటికే అధినేత చంద్రబాబుతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రెండు సార్లు సమావేశమై డిస్కస్ చేశారు. బస్సు యాత్రతో జనం ముందు కేసీఆర్ సర్కార్ తీరును ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లు


GHMC ఎలక్షన్స్ పై కూడా ఫోకస్ చేశారు టీడీపీ నేతలు. MLC ఎన్నికల్లాగే జంటనగరాల్లో పార్టీని బలోపేతం చేసి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని డిసైడయ్యారు. ఇన్ని రోజులు సర్కార్ వ్యతిరేక నిరసనలకు తోడు జిల్లాల టూర్ వీటికి బాగా ఉపయోగపడుతుందంటున్నారు తమ్ముళ్లు. భవిష్యత్తులో పార్టీ స్టాండ్ కావాలంటే జనంలో ఉండక తప్పదని డిసైడయ్యారు తమ్ముళ్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: