సినిమా పరిశ్రమలో మా ఎన్నికల సందడి ముగిసింది. రాజేంద్రప్రసాద్, జయసుధ ప్యానళ్లు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషం వరకూ పోరాడారు. ఈ ఎన్నికల వల్ల ఎవరికి ఏం ఒరిగిందన్న సంగతి పక్కకు పెడితే కొందరు మాత్రం తెగ ఖుషీ అయ్యారు. 

సినీతారలను ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. తెరపై కనిపించే తారలను డైరెక్టుగా చూస్తే వారు చాలా ఎక్సయిట్ అవుతారు. అలాంటిది ఆదివారం తెలుగు సినీరంగంలోని దాదాపు ప్రముఖులందర్నీ చూడగలిగారు. 

సాధారణంగా ఫిలింనగర్లో ఓ సినిమాస్టార్ ను చూడాలంటే.. వాళ్ల ఇంటికెళ్లాలి. వెళ్లినా కనిపిస్తారన్న గ్యారంటీ ఉండదు. ఇక స్టూడియోలకు సాధారణ జనాన్ని అనుమతించరు. ఎక్కడైనా ఆరుబయట షూటింగ్ జరిగినా.. మహా అయితే ఒకరో ఇద్దరో కనిపిస్తారు. 

ఆదివారం మాత్రం సినీ అభిమానులకు పండుగే అయ్యింది. దాదాపు మా సంఘంలో 700 వందల మంది వరకూ సభ్యులుంటే.. సగానికిపైగా ఓటింగ్ లో పాల్గొన్నారు. కొందరు ప్రముఖులు మినహా చాలా మంది నటీనటులు పోలింగ్ కు హాజరయ్యారు. పోలింగ్ జరుగుతున్న ఫిలింఛాంబర్స్ వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగుడారు. తమ అభిమాన తారలను.. ఇతర నటీనటులను కనులారా వీక్షించి పరవశించిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: