సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వ రుణా లు సరిగా చేరనందువల్ల దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో అన్నదాతల బలవన్మరణాలు ఎక్కువని అసోచామ్ ప్రకటించింది. ‘గ్రామీణ రంగంలో నిర్మాణాత్మకమైన మార్పులు, సంస్కరణలు’ అంశంపై అసోచామ్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ పేర్కొన్నారు. దేశంలో 2/3 వంతు కమతాలు ఒక హెక్టార్ , అంతకంటే తక్కువ ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. చిన్న కమతాలు పెరగడం వల్ల ప్రభుత్వ రుణాలు ఆశించిన రీతిలో సక్రమంగా అందక, రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారు. మంచి వ్యవసాయ విధానాలు ఆచరించకపోవడం కూడా రైతుల్లో ఒత్తిడికి కారణమన్నారు. ఆర్థికంగా లాభసాటిలేని కమతాల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.


అన్నదాతల బలవన్మరణాలు

పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చిన్న కమతాలు ఉన్నాయి. కార్పోరేట్ తరహాలో వ్యవసాయం చేయడం లేదా సహకార పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు సాధించవచ్చని అసోచామ్ పేర్కొంది. చిన్న కమతాల ద్వారా వ్యవసాయ రంగంలో ఆశించిన స్ధాయిలో అభివృద్ధి సాధించలేమని అసోచామ్ రాష్ట్రప్రభుత్వాలను హెచ్చరించింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే వివరాలను అసోచామ్ అధ్యయనం చేసిం ది. తొమ్మిది కోట్ల కుటుంబాల్లో 23 లక్షల కుటుంబాలకు 0.01 హెక్టార్ కంటే తక్కువ భూకమతం, 2.87 కోట్ల మందికి 0.01 నుంచి 0.4 హెక్టార్ల వరకు, 3.14 కోట్ల మందికి 0.41 నుంచి ఒక హెక్టార్ వరకు కమతాలు ఉన్నాయి. 0.01 హెక్టార్ కంటే తక్కువ కమతం ఉన్న వారిలో 16 శాతం మంది వ్యవసాయం ద్వారానే బతుకుతున్నారు. ఒక హెక్టార్ అంతకంటే తక్కువ భూమి ఉన్న వారు వ్యవసాయం ద్వారా మనుగడ సాధించలేరని అసోచామ్ పేర్కొంది. చిన్న భూకమతాల రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. ఆస్తి విలువ కంటే వడ్డీ భారం రైతులపై పెరుగుతోంది. దేశమంతా ఇదే పరిస్థితి వ్యాపించింది.

6a00d83451b5a569e201156f2f736b970c-800wi.jpg (610×407)

వ్యవసాయం బాగుపడాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు రావాలి, రైతులకు పెట్టుబడులు ఇచ్చేందుకు సంస్ధలు ముందుకు రావాల్సి ఉంటుంది. పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే నైపుణ్యం పెరగాలని అసోచామ్ పేర్కొంది.కేరళ, గుజరాత్, పంజాబ్, హర్యానాల్లో చిన్న భూకమతాలైనా విలువ ఎక్కువగా ఉండడం, రుణాలు లభించడం వల్ల రైతుల పరిస్ధితి బాగుందన్నారు. కేరళలో 27.3 శాతం భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తే, ఇతర రాష్ట్రాల్లో తమ భౌగోళిక ప్రాంతంలో 60 శాతం భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు ఇంటి ఆస్తి విలువ రూ.22.85 లక్షల ఉంటే, గ్రామీణ ప్రాంతంలో రూ.10.07 లక్షల ఉ ఉంది. అలాగే ఒబిసి వర్గానికి చెందిన వారు గంపగుత్తగా భూకమతాలను కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలకే నెలకు 20వేల రూపాయల ఆదాయం వస్తోంది. 9 కోట్ల కుటుంబాల్లో 7.7 కోట్ల కుటుంబాల ఆల్పాదాయం కేటగిరీలో ఉండగా, 1.3 కోట్ల మంది నెలకు పదివేల రూపాయలు, 0.36 శాత మంది మాత్రమే నెలకు 20వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారని అసోచామ్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: