లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (పీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన మొదటి పేపర్ ప్రశ్నాపత్రం వాట్సప్ మెసెంజర్ సర్వీస్‌లో లీక్ అయింది. లీకైన పరీక్షా ప్రతం అసలుదేనని పోలీసులు నిర్ధారించిన వెంటనే తొలి పేపర్‌ను రద్దు చేస్తూ యూపీపీఎస్సీ చీఫ్ సెక్రటరీ అలోక్ రంజన్ ఆదేశాలు జారీచేశారు. రైద్దెన పరీక్షను తిరిగి నిర్వహించడానికి త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామన్నారు.

వాట్సప్ మెసెంజర్ సర్వీస్‌

పరీక్ష ప్రారంభానికి కొద్దిసేపటికి ముందే ఉదయం 9.15 గంటలకు పరీక్షాపత్రం లీకైంది. లీకైన పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు చెందిన ప్రశ్నాపత్రం అసలుదేనని నిర్ధారించుకున్నాం. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చాం అని యూపీ డీజీపీ ఏకే జైన్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టడానికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పలు బృందాలను రంగంలోకి దించామని, లీకేజీకి బాధ్యులైన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. లీకైన ప్రశ్నాపత్రం ఒక్కో కాపీని రూ.5 లక్షలకు అమ్మినట్లు తెలుస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: