మా (మూవీ అసోసియేషన్ ) పెట్టినప్పటి నుంచి అద్యక్షపదవి యూనానిమస్ గా జరుతూ వస్తుంది. ఈ అధ్యక్ష పదవి టాలీవుడ్ అగ్రహీరోలు కూడా వహించారు. చివరగా మురళి మోహన్ కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకోబడ్డాడు. కానీ నిన్న జరిగిన మా ఎన్నికల్లో పూర్తి విరుద్దంగా జరిగింది. పోటీలు, రాజకీయాలు, విమర్శలు, కోర్టు కేసు దాకా పోయింది.


మా ఎలక్షన్స్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నాగబాబు (రాజేంద్ర ప్రసాద్ మద్దతు ప్యానెల్)


ఎట్టకేలకు ఎన్నికలైతే జారిగాయి కానీ ఈ ఎలక్షన్స్ పై చాలా మందికి విముఖత ఏర్పడింది. రసవత్తర పోరులో ఓటు వేయడానికి అగ్రహీరోలు రాకపోవడం ఆశ్చర్యని కలిగించింది.  ఎలక్షన్స్ మొత్త ఎక్ట్రానిక్ సిస్టం తో నడిచింది. మీడియా బృందం మొత్తం కాచుకొని పెద్ద హీరోల రాక కోసం ఎదురు చూశారు.


మా ఎలక్షన్స్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మురళీమోహన్ (జయసుధ మద్దతు ప్యానెల్)


ఎలక్షన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఎవరూ రాలేదు.  బయటకు కనిపించినంత సీరియస్ గా ‘మా’ ఎన్నికలను నటీనటులు పట్టించుకున్నట్టు లేరు. ఓటేసేందుకు ఎవరూ రావడం లేదు. 700 మందికి పైగా సభ్యులున్న ‘మా’ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగనుండగా… మధ్యాహ్నం 12 గంటల వరకూ సుమారు 180 ఓట్లు మాత్రమే పోల్ అయినట్టు వెల్లడించారు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవి తేజ, రామ్ చరణ్ తదితర హీరోలు ఓటేసేందుకు రాలేదు. తొలుత 450 వరకూ ఓట్లు పోల్ కావచ్చని భావించినప్పటికీ, 300 మంది వరకూ మాత్రమే ఓటేసేందుకు రావచ్చని సమాచారం. పోలింగ్ మరో 2 గంటల్లో ముగియనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: