కేసీఆర్ కూతురుగానే కాకుండా.. సొంత ఇమేజ్ కూడా సంపాదించుకున్న నాయకురాలు కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి.. బతుకమ్మ ఆటలు ఆడి.. ఉద్యమ సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మలచుకుంది. రాజకీయ జీవితానికి పునాది వేసుకుంది. 

గత ఎన్నికల్లో ఏకంగా ఎంపీ స్థానానికే పోటీ చేసి గెలిచింది. కేసీఆర్ టాకింగ్ పవర్ ను పుణికిపుచ్చుకున్న ఈ నాయకురాలు.. పార్లమెంట్ లోనూ బాగానే మాట్లాడుతోంది. రాజకీయ వ్యంగ్యోక్తులు, విమర్సలు బాగానే చేస్తోంది. లేటెస్టుగా ఆమె హైదరాబాద్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఏకంగా ప్రధాని మోడీనే కామెంట్ చేసింది. 

కాంగ్రెస్ నేత శశిథరూర్ రాసిన ఇండియా శాస్త్ర అనే ఆంగ్ల పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించింది. ఇటీవల బీజేపీతో సఖ్యతగా ఉంటున్న టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ నేత రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడమూ కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఆ పుస్తకావిష్కరణకు కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, సినీనటి మంచులక్ష్మి కూడా హాజరయ్యారు. 

ఆవిష్కరణ తర్వాత సభికులతో ప్రశ్నాజవాబు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో ఓ వ్యక్తి.. మోడీకి మహా భారతంలో ఏ పాత్ర సరిపోతందని కవితను ప్రశ్నించారు. ఏం చెప్పినా ఇరుకున పడే ఈ ప్రశ్నకు కవిత తెలివిగా సమాధానం ఇచ్చారు. ఏకలవ్యుడి పాత్ర సరిపోతుందని బదులిచ్చారు. ఏకలవ్యుడు ఎంత ప్రతిభ కలవాడైనా.. అతను కౌరవుల పక్షాన పోరాడాడు. మరి ఆయనతో మోడీని పోల్చడం నిజంగా సాహసమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: