మహాభారతంలో అభిమన్యుని గురించి అందరికీ తెలుసు. మహా పోరాట యోధుడు. యుద్ద నైపుణ్యం గురించి ఆరితేరిన వాడు అయితే ఇవన్నీ ఆయన పుట్టిన తర్వాత అబ్బినవి కాదు తల్లి గర్భంలో ఉన్నపుడే విని నేర్చుకున్నాడు. పద్మవ్యూహం గురించి ,రాజనీతి గురించి యుద్ద తంత్రాల గురించి అర్జును సుభద్రకు చెబుతుంటాడు. అప్పడు సుభద్ర కడుపులో ఉండి అభిమన్యుడు అన్నీ విని తండ్రిని మించిన తనయుడు అవుతాడు. ఈ కథ అంతా ఎందుకు చెబుతన్నానంటే యూకే లో అచ్చూ ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

14 వారాల వయసు ఉన్న ఒక గర్భస్త శిశువు కదలికలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా గర్భిణులు అల్ట్రా స్కానింగ్ తీయించుకుంటారు. ఆ సంద్భంగా గర్భంలో ఉన్న శిశువు కదలిక యాంగిల్స్ కంప్యూటర్ లో కనిపించడం సర్వ సాధారం.. కానీ ఇక్కడే ఒక మెరాకిల్ జరిగింది. జెన్ కార్డినల్ అనే మహిళ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ తీసే సమయంలో గర్భంలో ఉన్న శిశువు చప్పట్లు కొట్టడం గమనించారు. అంతే అక్కడున్న సిబ్బంది ఆశ్చర్యంతో దాన్ని మళ్లీ రివైండ్ చేసి చూడగా శిశువు చప్పట్లు కొడుతున్న సంగతి గుర్తించారు. ఇక ఇంత పెద్ద విషయాన్ని మనోళ్లు ఊర్కే వదులుతారా వెంటనే యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు అది టాక్ ఆప్ ది టౌన్ గా మారింది. దీన్ని చూసేందుకు జనాలు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: