”అయ్యా నాకు రుణమాఫీ రాలేదు..సర్కార్ ఏమో రుణమాఫీ బ్యాంకుల్లో వేశామని చెబుతోంది..కానీ నాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు..మీరే ఆదుకోవాలి”..అంటూ ఓ మహిళా రైతు మంత్రి రావెల కిశోర్ బాబు ఎదుట వాపోయింది. వెంటనే ఆ మంత్రి ఏం చేస్తారు. ? వెంటనే అక్కడున్న అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని అంటారు..కదా..కానీ అలా చేయలేదు. గత ప్రభుత్వాల దోపిడిపై సదరు మంత్రి తూర్పారబట్టారు. దీనితో అక్కడున్న రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ ఆందోళనకు దిగారు.

రావెల కిశోర్ బాబు

ప్రత్తిపాడులో మంత్రిని నిలదీసిన మహిళ రైతు..ప్రత్తిపాడు నియోజక వర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని మహిళ రైతు సూటిగా రుణ మాఫీ విషయాన్ని ఆడిగింది. ”రెండు దఫాలుగా రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంది, కానీ ఇప్పటి వరకు తమ రుణంలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు” అని మంత్రిని నిలదీసింది. దీంతో సహనం కోల్పోయిన మంత్రి కాంగ్రెస్‌, వైసిపి అవినీతిపై అస్త్రాలు సంధించారు. ”లబ్ధిదారులకు కృతజ్ఞతాభావం లేదు..చిన్న పిల్లాడికి చాక్లెట్‌ ఇస్తే థ్యాంక్స్ చెబుతాడు… మేం మీకోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.. కనీసం మమ్మల్ని గుర్తించడంలేదు” అంటూ మంత్రి రావెల ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రిని నిలదీసిన మహిళ రైతు

Minister Ravela.jpg (400×300)

కోపంతో ఊగిపోయిన మంత్రి..అయినా ఆ మహిళా రైతు శాంతిక పోవడంతో, అమెను అక్కడ నుండి తీసుకెళ్లడం అంటూ మంత్రి తన అనుచరులకు తెలిపారు. రుణ మాఫీ గురించి అడిగినందుకు మహిళ రైతుకు సాక్షాత్తు మంత్రి వర్యులే ఇలాంటి సమాధానాలు చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఇక కోపంతో తూగిపోయిన మంత్రి సమస్యలు ఎన్ని ఉన్నా.. నేనున్నాను అంటూ సర్దుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: