బొగ్గు కుంభకోణంలో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. దాసరికి చెందిన సౌభాగ్య మీడియాకు సంబంధించిన 2.25 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రోవిజనల్ అటాచ్ మెంట్ చేసినట్టుగా ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లలోని రెండు వాహనాలు, వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్సడ్ డిపాజిట్లు, ఓ ఫ్లాట్ ను తాత్కాలికంగా జప్తు చేశారు.


బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్న దాసరి


యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్న దాసరి నారాయణ రావు బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఈడీ.. దాసరి.. జిందాల్ గ్రూప్ నకు బొగ్గు గనులు కేటాయించినట్టు గుర్తించింది. అందుకు బదులుగా దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలోకి రెండు కోట్ల రూపాయల మేర పైచిలుకు పెట్టుబడులు అప్పనంగా వచ్చిపడినట్టు తేల్చింది. 



ఆస్తులకు ఉండవచ్చని సన్నాయి నొక్కులు నొక్కారు


ఈ ఆస్తుల జప్తు వ్యవహారంపై దర్శకరత్న దాసరి నారాయణ రావు పెదవి విప్పారు. తన వ్యక్తిగత ఆస్తులేవీ జప్తు కాలేదని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారు. అటాచ్‌మెంట్ ఉంటే సౌభాగ్య మీడియా ఆస్తులకు ఉండవచ్చని సన్నాయి నొక్కులు నొక్కారు. సౌభాగ్య మీడియాలో తాను కేవలం వాటాదారుణ్ని మాత్రమేనని దాసరి చెప్పుకొచ్చారు. బొగ్గు కుంభకోణంలో దాసరి మెడపై ఎప్పటి నుంచో కత్తి వేలాడుతూనే ఉంది. చట్టం చేతులు చాలా పెద్దవన్న నానుడిని నిజం చేస్తూ ఈడీ ఒక్కో చర్చను అమలు చేస్తూ వస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: