ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా వచ్చే నెల 19న ఢిల్లిలో జరిగే కాంగ్రెస్‌ రైతు ర్యాలీలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొననున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొంటారు. రైతు సమస్యలపై పోరాడేందుకు సోనియాగాంధీ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో ర్యాలీ నిర్వహించి, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావే శాలకు ముందు రాహుల్‌ గాంధీ సెలవు తీసుకున్న సంగతి తెలిసిందే.

రాహుల్‌ గాంధీ 


అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నదీ ఇతమిత్థంగా తెలియడం లేదు. బిల్లుపై చర్చకు రావాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ ఆయనకు రాసిన లేఖలో చర్చలో పాల్గొనేందుకు నిరాకరించారు. బీజేపీ ప్రభుత్వం ఏక పక్షంగా భూ సేకరణ ఆర్డినెన్సును జారీ చేసిందని, చర్చలకు పిలవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఈ బిల్లు రైతు వ్యతిరేకమని, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2013 నాటి భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రతిపాదించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. దానికి మద్దతిచ్చేది లేదని సోనియా గాంధీ స్పష్టం చేశారు. విమర్శలపై నితిన్‌ గడ్కరీ స్పందించారు. సామాజిక ప్రభావ అం చనా పరిథినుంచి వివిధ ప్రాజెక్టులను మినహాయించడంపై వస్తున్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారీ భూ సేకరణ ప్రాజెక్టులు సామాజిక ప్రభావం అంచనా నుంచి తప్పించే ఓ విధానాన్ని సృష్టించిందన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: