తెలుగు చిత్ర ప‌రిశ్రమ పెద్దలు షాక్ లకు గుర‌వుతున్నారు. ఆస్తుల గొడ‌వలతో స‌త‌మ‌త‌మౌతున్నారు. ఆస్తులు పెంచుకునేందుకు అడుగు ముందుకేస్తుంటే అడ్డంగా బుక్క‌వుతున్నారు. అంతులేని ఆస్తుల వివాదంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. తాజాగా ద‌ర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాస‌రి నారాయ‌ణ‌రావు బొగ్గు గ‌నుల వివాదంలో ఆయ‌న  చెందిన 2 కోట్ల రూపాయ‌ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. మ‌రోవైపు చిత్ర ప‌రిశ్రమ ప్రసిధ్ది చెందిన ఆన్నపూర్ణ స్టూడియో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు స‌కాలంలో చెలించ‌క‌పోవ‌డంతో, అన్నపూర్ణ స్టూడియోస్ చెందిన ఆస్తులను జ‌ప్తు చేస్తున్నామ‌ని ఇప్ప‌టికే ప్రకటించేశారు. 


కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు చుట్టూ ఉచ్చు 


దేశవ్యాప్తంగా వివాదంగా మారిన బొగ్గు కుంభకోణంలో దర్శకరత్న, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు చుట్టూ ఉచ్చు క్రమంగా బిగుస్తోంది. గ‌తంలోనే దాసరిని ఈ కుంభకోణంలో ఈడీ విచారించింది. జార్ఖండ్‌లో జిందాల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపుల్లో ఆ సంస్ధ నుంచి ముడుపులు నేరుగా సౌభాగ్య మీడియా ఖాతాలోకి 2.25 కోట్ల రూపాయ‌లు చేరాయి. అంతేకాదు దాసరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధమైంది. బొగ్గు కుంభకోణం కేసులో దాసరి నిందితుడిగా ఉన్నారు. దాసరి పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేసింది. 

 దాసరి బొగ్గుశాఖ సహాయ మంత్రిగా

Image result for jindal company

యూపీఏ-1 హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో.. అప్పుడు దాసరి బొగ్గుశాఖ సహాయ మంత్రిగా వున్నారు. జార్ఖండ్‌లో జిందాల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపుల్లో అవినీతి జరిగిందనీ, కేటాయింపులు జిందాల్ సంస్థకు దక్కేలా వ్యవహరించారనీ, దీంతో ఆయనకు చెందిన కంపెనీ సౌభాగ్య మీడియాలో జిందాల్ పెట్టుబడులు పెట్టిందనీ, ఈ పెట్టుబడులు ముడుపులేనని సీబీఐ చార్జిషీట్‌ సిద్ధం చేసింది.


నివాస స్ధలాన్ని ఈడీ జ‌ప్తు 

Image result for dasari narayana rao residence

 కేసును దర్యాప్తు జ‌రుపుతున్న ఈడీ ఆయ‌న ఆస్తులను స్వాధీనం చేసుకుంది. దాస‌రికి చేందిన రెండు వాహ‌నాలు, 50 లక్ష‌ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్ ర‌శీదులను, ఓ నివాస స్ధలాన్ని ఈడీ జ‌ప్తు చేసింద‌ని తెలుస్తోంది. ఈ ఆస్తుల మొత్తం విలువ 2 కోట్ల వ‌రకు ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ ఆస్థుల స్తంభ‌న ఉత్త‌ర్వులు వ‌చ్చే 180 రోజుల పాటు ఆమ‌లులో ఉంటుంద‌ని ఈడీ స్ప‌ష్టం చేసింది.


 ఆన్నపూర్ణ స్టూడియో విస్తరించ‌డానికి

Image result for annapurna studio

మ‌రోవైపు.. ఇటీవ‌ల నాగార్జున‌కు చెందిన‌  బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ 2 లోఉన్న 7 ఎక‌రాల ఆన్నపూర్ణ స్టూడియో విస్తరించ‌డానికి ఆంధ్రా బ్యాంక్ లో 32.3 కోట్లు, ఇండియన్ బ్యాంక్ లో 29.7 కోట్ల రూపాయలు ఆప్పుగా తీసుకున్నారు. తిరిగి అప్పు కట్టకపోవడంతో, గతేడాది ఓసారి… ఈ ఏడాది జనవరి 2న మరోసారి బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. అయితే నోటీసులకు స్పందన రాకపోవడంతో.. అన్నపూర్ణ స్టూడియోస్ ఆస్తులు హ్యాండోవర్ చేసుకోవాల్సి వచ్చిందంటున్నాయి బ్యాంకు వర్గాలు. 


రియాల్టీ షోలతో బిజీగా ఉండే నాగార్జున

Image result for nagarjuna koteeswarudu

కోట్ల రూపాయల ఆస్తులు.. ఓ వైపు సినిమా షూటింగులు.. మరోవైపు రియాల్టీ షోలతో బిజీగా ఉండే నాగార్జునకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కినేని కుటుంబ సభ్యులు గ్యారెంటర్లుగా తీసుకున్న 62 కోట్ల రూపాయల అప్పు కట్టకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించాయి బ్యాంకులు. ఆన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల స్ధలం, బిల్డింగ్ ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ఇండియన్ బ్యాంక్, ఆంద్రా బ్యాంక్ సీజింగ్ నోటీసులు ఇచ్చాయి. ఈ నెల 20న ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సంయుక్తంగా న్యూస్ పేపర్స్ లో ప్రకటన ఇచ్చారు. మొత్తం వడ్డీతో కలిపి అన్నపూర్ణ స్టూడీయోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. బ్యాంకుకు 62 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ ప్రకటనలో స్పష్టం చేశాయి బ్యాంకులు.లోన్ గ్యారంటీయర్లుగా నాగార్జున, సుప్రియ, వై.సురేంద్ర పేర్లు ఉండగా, నాగ సుశీల, వెంకట్ రొడ్డం, నిమ్మగడ్డ ప్రసాద్, అన్నపూర్ణ స్టూడియోతో కలిసి లోన్ తీసుకున్నవారి జాబితాలో ఉన్నారు. అయితే నాగ్ అండ్ కో మాత్రం ఈ విషయాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: