ఆంధ్రాలో ఇప్పుడు ప్రధానంగా ఉన్నది రెండే పార్టీలు.. తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ.. ప్రధాన నాయకులు కూడా ఇద్దరే.. చంద్రబాబు, జగన్.. వీరిద్దరి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. కానీ.. ఫ్యూచర్ సీన్ త్వరలోనే మారిపోనుందా..? 

జగన్ వర్సస్ చంద్రబాబు కాస్తా... జగన్ వర్సస్ లోకేశ్ గా మారిపోతోందా.. ? ఈ అనుమానాలు నిన్న అసెంబ్లీ ప్రాంగంణంలో జరిగిన చిన్న గొడవతో బయలుదేరాయి. విషయం ఏంటంటే.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో శాసనమండలి ఛైర్మన్  చక్రపాణి తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించారు. 

ఎమ్మెల్సీలుగా రామకృష్ణ, వి.వి.వి. చౌదరి, సంధ్యారాణి, కోలగట్ల వీరభద్రస్వామి, సుభాష్  చంద్రబోస్  ప్రమాణం ప్రమాణస్వీకారం చేశారు. ఐతే.. ఈ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా.. తెలుగుదేశం, వైసీపీ మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చిన ఇరు పార్టీల అభిమానులు.. మండలి ప్రాంగణంలో ఒకరినొకరు నెట్టుకున్నారు. 

మొదట అధికార పక్షం కార్యకర్తలను చూసి.. వైసీపీ అభిమానులు జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. జై జగన్.. జై జగన్ అని నినాదాలు చేశారు. దీంతో అటు టీడీపీ అభిమానులు కూడా రెచ్చిపోయారు.. ఐతే వారు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేయకుండా.. జై లోకేశ్ .. జైజై లోకేశ్ అని నినాదాలు చేయడం విశేషం. అంటే సీన్ క్రమంగా జగన్ వర్సస్ లోకేశ్ గా మారపోతుందనేగా..? కాదంటారా..? 


మరింత సమాచారం తెలుసుకోండి: