టీడీపీ మొన్ననే 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ 33 ఏళ్లలో ఎన్నో తీపి, చేదు అనుభవాలు.. ప్రస్తుతం పదేళ్ల పోరాటం తర్వాత ఏపీలో అధికారంలోకి వస్తే.. తెలంగాణలో మాత్రం ఇంకా కష్టాల్లోనే ఉంది. దాదాపు 20 ఏళ్ల నుంచి పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతుల్లోనే ఉన్నాయి. 

 రాయలసీమ బాబుకు బాగానే ఝలక్ ఇచ్చింది.

Image result for tdp

ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచిస్తూ పార్టీని నడిపిస్తున్న ఆయన ఇప్పుడు లేటెస్టుగా పార్టీపరంగా  కొత్త టార్గెట్ పెట్టుకున్నారు. అదే ఆపరేషన్ రాయలసీమ. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ బాబుకు బాగానే ఝలక్ ఇచ్చింది. అక్కడ అనంతపురం జిల్లాలో తప్ప మిగిలిన జిల్లాల్లో టీడీపీ చాలా దెబ్బతిన్నది. 

చంద్రబాబు.. రాయలసీమ జిల్లాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు.

Image result for tdp
పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న వ్యూహంతో ఉన్న చంద్రబాబు.. రాయలసీమ జిల్లాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు. కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టిన కడప జిల్లాను సైతం తెలుగుదేశం కంచుకోటగా మలచుకునే వ్యూహాలు రచిస్తున్నారు.  పులివెందుల రైతులకు నీరిచ్చి అక్కడి పంటలను కాపాడుతూ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. 



తాజాగా పట్టిసీమ ప్రాజెక్టును కూడా ఏడాదిలోనే పూర్తి చేయాలని పట్టుపట్టడం వెనుక కూడా అదే వ్యూహం కనిపిస్తోంది. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కర్నూలు లో నిర్వహించినప్పుడు అక్కడ జిల్లాకు మెరుగైన అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించారు. లేటెస్టుగా చిత్తూరు జిల్లాలో మూడు ప్రతిష్టాత్మక సంస్థలకు పునాది రాయి వేయడం వెనుక కూడా అదే ప్లాన్ ఉందన్నమాట. మొత్తానికి రాయలసీమను అభివృద్ధి చేసి అక్కడ రాజకీయంగా పట్టుసాధించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అభివృద్ధితో రాజకీయం చేయడం మంచిదేగా..? 


మరింత సమాచారం తెలుసుకోండి: