ఈ మధ్య మహిళల పట్ల వివక్ష ఏ విధంగా జరుగుతుందో రోజూ మనం చూస్తునే ఉన్నాం. మహిళలను గౌరవించాలి వారికి సముచిత స్థానం కల్పించాలి అంటూ పెద్ద పెద్ద నాయకులు, సంఘ సంస్కర్తలు లెక్చర్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సంఘటన మహిళల పట్ల పురుషుల అహంకార పూరిత దుశ్చర్య ఎలాంటిదో తెలుస్తుంది. విషయానికి వస్తే వారు ఇద్దరూ లెక్చరర్లు విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారి బంగారు భవిష్యత్ కు బాట వేయాల్సిన వారు. కానీ  ఒక మహిళా లెక్చరర్‌ను జుట్టు పట్టుకుని తోటి లెక్చరర్‌ కొట్టాడు.


కాలేజీలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కొట్టుకునే వరకు వచ్చింది. కొన్ని నెలలుగా తనకు జీతం ఇవ్వడంలేదని మహిళా లెక్చరర్‌ పిర్యాదు చేసింది. దీంతో కోపం వచ్చిన సదరు లెక్చరర్  మహిళా అని కూడా చూడకుండా మరో లెక్చరర్‌ ఆమెను జుట్టు పట్టుకుని కొట్టాడు. అదే సమయంలో తోటి లెక్చరర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరువురి లెక్చరర్ల మధ్య గొడవకు దారి తీసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: