మనిషి బతుకు దెరువు.. ఆకలి బాధ.. వెరసి జీవన పోరాటం. బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు ఎంతో మంది వలస వస్తూ ఉంటారు. ఇక్కడ కూలీ నాలీ చేసుకొని తమ బతుకు దెరువు కొనసాగిస్తుంటారు. వీరికి పక్కా ఇళ్లు ఉండవు. గుడిసెల్లోనో కాస్త పెద్ద కుటుంబం అయితే ఏ పాత ఇంట్లోనే కాపురం చేస్తుంటారు. విషయానికి వస్తే ఆ మధ్య అకాల వర్షాలకు గోడలు నాని పోయాయి. ప్రమాదకరంగా మారి ఆ గోడల మధ్య బతుకు పోరాటం చేస్తున్న కుటుంబంలో విషాదం నెలకొంది. గత అర్ధరాత్రి ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కాగా వారి తల్లిదండ్రులు స్వల్ప గాయాలు అయ్యాయి. బోరబండ లోని దేవయ్య బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నూల్ జిల్లాకు చెందిన రాజు జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.


ఇద్దరు చిన్నారులు నవ్య, చరణ్ తో తల్లిదండ్రులు


దేవయ్య బస్తీలో నిన్ననే కుటుంబంతో సహా అద్దెకు ఇంట్లో దిగాడు. అసలే పాత గోడలు.. అందులోనూ వర్షంతో తడిసి పోయి ఉన్నాయి. ఆ గోడలే తమ పిల్లలకు మృత్యు ద్వారాలుగా మారుతాయను కలలో కూడా ఊహించలేదు ఆ తల్లిదండ్రలు. నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా గోడ కుప్పకూలింది. అంతే నవ్య(4), తీవ్రంగా గాయపడిన చరణ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. . అలాగే గాయపడి దంపతుల్లో భర్త కాలు విరిగినట్లు తెలుస్తోంది. భార్య ఇంకా అపస్మారక స్థితిలో ఉందని 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ఈ విషాద సంఘట చూసిన వారంతా కంట తడిపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: