తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా అందుకొన్నాడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. కమలనాథల్లోని కురువృద్ధ నేతగా ఉన్న అద్వానీని మోడీ సర్కారు ఇలా సత్కరించింది. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంటు ఉండుంటే అద్వానీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అవార్డు దక్కేది కాదని వేరే చెప్పనక్కర్లేదు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఈ అవార్డును ఇచ్చారు. తమ పార్టీ తరపున ప్రధానమంత్రి గా ఉండిన వాజ్ పేయికి భారతరత్నను ప్రదానం చేసి.. అదే టర్మ్ లో ఉప ప్రధానిగా ఉండిన అద్వానీకి ఆ తర్వాతి స్థాయి అవార్డు అయిన పద్మవిభూషణ్ ను ఇచ్చింది కమలం ప్రభుత్వం. 

జనతా పార్టీ సీనియర్ నేతకు కొంత తలనొప్పిని తగ్గించడానికి


మరి ఇంతే కాదు.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతకు కొంత తలనొప్పిని తగ్గించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అద్వానీపై ఉన్న కేసులను కొట్టి వేయించేయనున్నారని సమాచారం. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ ఒక నిందితుడిగా ఉన్నారు. 1992 డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని సృష్టించిన కరసేవకులకు భారతీయ జనతా పార్టీ నేతలు నాయకత్వం వహించారు. ఎల్ కే అద్వానీ, ఉమాభారతి, శివసేన ఆవిర్భావకర్త బాల్ ఠాక్రే తదితరులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆద్వానీపై  సీబీఐ సెక్షన్ 153 A, 153B, సెక్షన్ 505 ల కింద కేసులు నమోదు చేసింది.


అద్వానీపై కేసులు నమోదు 


 ఘర్షణలు రేకెత్తించడం, అసత్యాలను ప్రచారం చేయడం , రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలతో అద్వానీపై కేసులు నమోదు చేశారు. దశాబ్దాలుగా ఈ కేసులు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులూ ఇలాంటి కేసులను భారతీయ జనతా పార్టీ వాళ్లు గర్వంగా భావించారు. అవి తమ హిందుత్వ వాదానికి నిదర్శననుకొన్నారు. అయితే ఇప్పుడు అద్వానీకి వయసు మీద పడుతోంది. ఆయన పెద్ద తరహాలో సెటిలయిపోదామనుకొంటున్నాడు. ఇక అధికారం చేతిలో ఉంది కాబట్టి సీబీఐ ఎలాగూ కమలం పార్టీకి అనుకూలంగానే వ్యవహరించవచ్చు. ఈ నేపథ్యంలో ఆ కేసులకు సరైన ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానాలు వాటిని కొట్టివేసేందుకు అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. 


బాబ్రీ మసీదు విధ్వంసంలో 

Image result for babri masjid

అయితే ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ నేతలను వదలడం ఇష్టం లేని కొంతమంది ముస్లింలు దీనిపై పై కోర్టుకు వెళ్లారు.  బాబ్రీ మసీదు విధ్వంసంలో అద్వానీ వంటి వారి పాత్రను తగ్గించి చూపేందుకు.. వారిపై కేసులు ఎత్తేసుందుకు కుట్ర జరుగుతోంది.. సీబీఐ అందుకు సహకరిస్తోందని వారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అద్వానీకి, సీబీఐకి ఇతర నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. మరి అధికారం చేతిలో ఉన్న తరుణంలో అద్వానీకి ఈ పాత కేసుల నుంచి విముక్తి లభిస్తుందా?! లేక ఆ వ్యవహారం చిరకాలం వెంటే ఉంటుందా?!



మరింత సమాచారం తెలుసుకోండి: