కేసీఆర్ ఏడాది పాలనపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఉద్యోగులు వంటి కొన్ని వర్గాలు ఆనందంగా ఉంటే.. విద్యార్థులు వంటి వారు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల హామీలపై ఇంకా నోరుమెదపడం లేదని మరికొన్ని వర్గాల వారు ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో టీజేఏసీ అధ్యక్షడు కోదండరామ్ కేసీఆర్ పాలనపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ప్రజలను ,వారి ఆకాంక్షలను విస్మరిస్తే మళ్లీ ఉద్యమాలు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ ప్రస్తుతం ప్రొఫెసర్ పాత్రకే పరిమితమయ్యారు. 

స్వామిగౌడ్, శ్రీనివాసరెడ్డి, దేవీప్రసాద్ వంటి ఉద్యమ నేతలను రాజకీయాల్లోకి ఆహ్వానించి పెద్దపీట వేసిన కేసీఆర్.. కావాలనే కోదండరామ్ ను పక్కకుపెట్టారన్న వాదన ఉంది. దీనికితోడు కోదండరామ్ కూడా క్రియాశీల రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ ఎంపీ సీటు ఆఫర్ చేసినా కోదండరామ్ అంగీకరించలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.  

తాజాగా కోదండరామ్ ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. తెలంగాణలో ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా... ఇంకా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆరంభం కాలేదని కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంపై  ప్రజల్లో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని.. వాటిని పాలకులు విస్మరిస్తే ఉద్యమాలు వస్తాయని ఆయన కామెంట్ చేయడం ఒక రకంగా కేసీఆర్ కు హెచ్చరికే.. 



మరింత సమాచారం తెలుసుకోండి: