ఈ-కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థ స్నాప్‌డీల్..డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ రుపీపవర్‌లో అత్యధిక వాటాలు కొనుగోలు చేసింది. నగదు, స్టాక్ రూపంలో కుదిరిన ఈ ఒప్పందం పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. రూ.4,500 కోట్ల స్థాయిలో ఉన్న ఆన్‌లైన్ ఫైనాన్షియల్ సర్వీస్ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్నాప్‌డీల్‌కు ఈ ఒప్పందం దోహదపడనున్నది.


ఆర్థిక విభాగానికి చెందిన ప్రాడక్టులు/ సర్వీసులను ఎంచుకోవడం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిందని, ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రుపీపవర్‌లో అత్యధిక వాటాలు కొనుగోలు చేసినట్లు స్నాప్‌డీల్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో కునల్ బాహ్ల తెలిపారు. గుర్గావ్ కేంద్ర స్థానంగా 2011లో ప్రారంభమైన రుపీపవర్ రుణాలు, క్రెడిట్ కార్డు, ఇతర వ్యక్తిగత ఆర్థిక సేవలకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది చివరినాటికి సిబ్బంది సంఖ్యను 200కి పెంచుకోవాలనుకుంటున్నటు కునల్ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 40 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం రుణాలు సేకరించే ఆలోచనేది సంస్థ వద్ద లేదని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: