దేశ వ్యాప్తంగా మహిళకు జరుగుతున్న అన్యాం రోజూ రోజు కూ పెరిగిపోతుంది. ఆడవారు ఎంత జాగ్రత్తలు తసుకున్న ఎక్కడో అక్కడ వీరిపై అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరగుతున్నా మనం రోజూ పేపర్లోనో, వార్తల్లోనే చూస్తున్నాం. మహిళలు అనేకరకాలుగా శారీరక, మానసిక హింసకు – దానిలో భాగంగా అనేక రకాల దాడులకు గురవుతున్నారు.


షీ టీమ్ కు సంబంధించిన పోస్టర్ 


మహిళలు మానవహక్కులను అనుభవించే పరిస్థితులు లేవు. స్వేచ్ఛగా, గౌరవప్రదంగా జీవించడానికి వారికి అవకాశాల్లేవు. దీనిపై సమర శంఖారావం పూరించింది తెలంగాణ రాష్ట్రం. నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ పని చేయనున్నాయి. ముఖ్య పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలులో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో సక్సెస్ అయిన షీ టీమ్స్‌ను రాష్ట్ర మొత్తం అమలులోకి తీసుకువచ్చింది. బస్సుల్లో, రైళ్లల్లో, బస్టాప్‌లలో మహిళలను వేధిస్తున్న ఈవ్‌టీజర్లను కట్టడి చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: