భారత దేశంలో బంగార ఆభరణాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో వేరే చెప్పనక్కర లేదు. భారత స్త్రీ కి బంగారానికి అభినాబావ సంబంధం ఉంది. ఈ బంగారం చాలా ప్రాచూర్యం కలిగినది సొసైటీలో మనిషి యొక్క విలువలను కూడా చెప్పే స్థాయి బంగారానికి ఉంది. అంతలా మనిషి జీవితానికి అటాచ్ అయ్యింది బంగారం. ఏ శుభకార్యాలకైనా ఈ బంగారం సందడి చాలా ఉంటుంది. గత సంవత్సరం ఈ బంగారం రేట్లు చుక్కలనంటుకున్నాయి. సగటు మనిషి కనీసం బంగారం అని కూడా అనలేని స్థతికి చేరుకుంది.


బంగారంతో తయారైన ఆభరణాలు


బంగారం, వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. ఈ మధ్య బంగారం ధర రూ. 410, వెండి రూ.550 మేరకు తగ్గాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో పదిగ్రాముల (తులం) బంగారం ధర రూ.26,690 కాగా, కిలో వెండి ధర రూ. 38,000 గా ఉంది. ఆభరణాలు, వెండి నాణేల తయారీ రంగంలో లావాదేవీలు మందకోడిగా జరుగుతుండటం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుంది.వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ సానుకూల సంకేతాలు ఇవ్వడం కూడా బంగారం ధరల తగ్గుదలకు  ప్రధాన కారణం అని విశ్లేషకుల చెబుతున్నారు.  దేశీయ మార్కెట్ ను ప్రభావితం చేసే సింగపూర్ లోనూ బంగారం ధర 0.5 శాతం, వెండి ధర 0.3 శాతం తగ్గింది.


మరింత సమాచారం తెలుసుకోండి: