మరికొద్ది సంవత్సరాల్లో దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఐటి రంగం పరిస్థితి మరోలా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం సంకేతంగా దేశంలో రెండో అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరోసారి జీతాల విషయంలో సిబ్బందిని నిరుత్సాహపరిచింది. వేతనాలను 6.5 శాతమే పెంచుతూ కంపెనీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతేడాది కూడా 6-7 శాతమే పెంచింది. కానీ కొత్త సిఇఒగా విశాల్‌ సిక్కా నియమితులైన తర్వాత చోటుచేసుకున్న పలు మార్పు లతో ఉద్యోగుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో కంపెనీ విఫలమ వుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ పట్టభద్రులు తమ మొదటి ఛాయిస్‌గా ఇన్ఫోసిస్‌నే ఎంచుకుంటారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించ డం లేదు. మందగనం వల్ల కంపెనీలో ఐదుగురు ఉద్యోగులకు ఒకరు వదిలి వెళ్లడం కనిపిస్తోంది. సీనియర్‌ స్థాయి నిష్క్రమనలు పెరిగాయి. వేతనాలను సరిగ్గా పెంచకపోవడం ఉద్దేశం వేరే అయి ఉంటుందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రత్యక్షంగా తొలగించే ప్రక్రియకు పూనుకోకుండా పరోక్షంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. రెండంకెల రెవెన్యూ వృద్ధి చేరుకోవడంలో దేశీయ ఐటి దిగ్గజ కంపెనీలు సంఘర్షణకు గురవుతున్నాయి. ఇన్ఫోసిస్‌ కొంత కాలంగా సరైన పనితీరును చూపకపోవడం వల్ల ప్రత్యర్థి కంపెనీలు టిసి ఎస్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌లు గతేడాది నుంచే వేగంగా చర్యలు చేపడుతూ ముందు కు దూసు కెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాబోయే త్రైమా సిక ఫలితాల్లోనూ పెద్దగా మార్పులేమీ ఉండకపో వచ్చని టిసిఎస్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌ కంపెనీలు చెప్పడం వాటి పరిస్థితిని అద్దంపడుతుంది. అమెరికా డాలర్‌ బలపడడంతో ఆదాయం వృద్ధిలో ఆయా కంపె నీల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

మరోవైపు టిసిఎస్‌ మాత్రం 8-10 శాతం మేరకు జీతాలను పెంచే అవకాశముందని ఐఐఎఫ్‌ఎల్‌ రీసెర్చ్‌ అంకిత సోమని అంటున్నారు. గతేడాది టిసిఎస్‌ తమ ఉద్యోగులకు రెండు అంకెల మేర జీతాలను పెంచింది. దేశంలో 100 బిలియన్‌ డాలర్లకు పైగా మార్కెట్‌ విలువ కల్గిన ఐటి రంగంలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వృద్ధి రేటు నెమ్మదించడం, పోటీ వాతావరణం మధ్య దేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీలు ప్రస్తుతం లాభాలను నిలుపుని పూర్వవైభం కోసం పోరాటం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: