దేశంలో నేర సామ్రాజ్యం రోజు రోజు కి విస్తరిస్తుంది. అక్రమ ఆయుధాలతో అటు పోలీస్ వ్యవస్థకే పెను సవాలుగా మారుతున్నారు దొంగలు. తాజాగా నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. బస్టాండ్‌లో బందోబస్తు డ్యూటీలో ఉన్న హోం గార్డులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.  దీంతో కానిస్టేబుల్ సిఐ కి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నారు. సీఐ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సోదా చేయడానికి వెళ్లగా అనుకోకుండా కాల్పులు జరిపారు.  ఈ కాల్పులు పాయింగ్ బ్లాక్ కావడంతో  కానిస్టేబుల్‌ లింగయ్య, హోం గార్డు మహేశ్‌ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ మొగిలయ్య, హోం గార్డు కిషోర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అంతే కాదు అక్కడే ఉన్న మరో ప్రయాణికుడికి కూడా గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల్లో గాయపడిన సీఐ మొగులయ్యతో పాటు ఓ గన్‑మెన్ ప్రస్తుతం హైదరాబాద్‑లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


కాల్పుల్లో మృతి చెందిన పోలీస్


దుండగులు పారిపోయే క్రమంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న కారును అడ్డగించారు. కారులో ఉన్న దంపతులపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తాడేపల్లిగూడెంకు చెందిన దొరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


దుండగులు కారుపై కాల్పులు జరిపిన విషయాలు చెబుతున్న బాధితుడు దొరబాబు


సంఘటన జరిగినే వెంటనే ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేశారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాల్పుల ఘటనపై జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించాం. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, కాల్పులు జరిపింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: