రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. ఆర్థికలోటు, రాజధాని కోల్పోవడం వంటి కారణాలతో ఆర్థికంగా కుదేలవుతోంది. మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడేందుకు నానా తంటాలు పడుతోంది. ఐతే.. ఇన్ని కష్టాల్లోనూ కొన్ని అవకాశాలు ఏపీకి అందివస్తున్నాయి. 

ఓ ప్రణాళిక ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తుమ నగరం నిర్మించుకునే అవకాశం ఏపీకి దక్కింది. అందుకు కేంద్రం కూడా తన వంతు సాయానికి ముందుకొస్తోంది. తాజాగా 2500కోట్ల వరకూ నిధులు మంజారు చేసింది. అటు చంద్రబాబు సింగపూర్ తోడ్పాటుతో అద్భుత రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఓ సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. దేశంలో 29 రాష్ట్రాలున్నా.. ఏదైనా వరుస క్రమంలో చెప్పాల్సి వచ్చినప్పుడు దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పేరే ఇప్పటివరకూ ముందు వస్తోంది. ఆంగ్లంలోని మొదటి అక్షరం Aతో పేరు మొదలుకావడమే అందుకు కారణం. 

ఇప్పుడు రాజధాని నగరాల్లోనూ అదే ఒరవడి కొనసాగనుంది. ఆంధ్రారాజధానిని అమరావతిగా ప్రకటించడంతో రాజధాని నగరాల జాబితాలో హైదరాబాద్ కంటే ముందే అమరావతి వస్తుంది. ఇప్పటివరకూ Aతో మొదలయ్యే రాజధాని నగరాలుగా త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని ఐజ్వాల్ ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన అమరావతి చేరబోతోంది. పెద్ద రాష్ట్రాల విషయానికి వస్తే.. అమరావతే మొదటి వరుసలో ఉంటుంది.

ఇకపై ఆంధ్రాజనం తమ పిల్లలకు అ.. ఆలు నేర్పేటప్పుడు.. అ అంటే అమరావతి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని నేర్పుతారేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: