మనం సాధారణంగా నిద్ర లేవగానే ఎదో ఒకటి చూస్తునే ఉంటా ఆ రోజు గనక మీకు అంతా శుభ జరిగితే అబ్బా ఈ రోజు నే లేచిన వేళా విషేశం బాగుంది. ఎవరి మోఖం చూశానో కాని అంతా శుభమే జరిగింది అని అనుకుంటాం. వాస్తవానికి మనం ఉదయాన్నే  నిద్రలేవగానే ఆవునుగానీ, అద్దాన్ని గానీ, తల్లిదండ్రులను గానీ, భార్యను , దేవుళ్ల పటాన్ని గానీ చూడటం ఆచారంగా కనిపిస్తోంది. అయితే పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక కారణం లేకపోలేదు.  మన ఇంట్లో అద్దం ఉంటుంది కదా అది సాధారణంగా లక్ష్మీ దేవి నివాస స్థనంగా పరిగణింప బడుతుంది. లక్ష్మీ దేవి అలంకారప్రాయంగా ఉంటుంది కాబట్టి. అందుకే మనం పొద్దున్నే అద్దం చూడటం మంచిది అద్దం చూస్తే లక్ష్మీదేవిని చూసినట్లే.. ఇక ఆవు గోమాత. ఆవు గురించి పురాణ కాలం నుంచి ఎన్నో లాభాలు వివరించారు.


సకల సంపదలు ఇచ్చే గోమాత


ఆవు అనేది సకల దేవతలను నిక్షిప్తం చేసుకున్నదని సకల దేవతా స్వరూపంగా భావిస్తాం. అందుకే ఆవును సందర్శించినట్లయితే మనం సకల దేవతలను సందర్శించినట్లే ఆరోజు శుభ సూచకము. ఇక ఇంటికి ఇల్లాలు దేవత అంటారు వివాహం జరిగినవారు తమ అర్థంగి ముఖం పొద్దున్నే చూస్తే చాలా మంచిది ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తారు భారత స్త్రీలు. ఏ నోము నోచినా ఏ పూజ చేసిన భర్త పిల్ల శ్రేయస్సు కోసమే కదా అందుకే ఆమె ముఖం చూస్తే మంచిది.

ఇక మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మొఖం చూస్తే లక్ష్మీనారాయణులను, శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఎందుకంటే పిల్లల యోగ క్షేమాలు కోరుకునే వారు వారే కాబట్టి. ఇలా మనం నిత్య జీవితంలో ప్రొద్దున్నే లేచి చేసే మంచిపనులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: