బడ్జెట్ 2015లో పేర్కొన్న కొన్ని సేవా పన్ను ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కొన్ని చౌక అవుతుండగా, మరికొన్ని ప్రియం అవనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

బయట తినడం: కేంద్ర బడ్జెట్‌లో వీటిపై 14 శాతం సేవా పన్ను విధించారు. ఇకపై రెస్టారెంట్ బిల్లులు మరింత ప్రియం కానున్నాయి. గతంలో 12.36 శాతంగా ఉన్న సేవా పన్ను ఇకపై 14 శాతంగా ఉండబోతుంది. దీనిని బట్టి రోజు కాకుండా వారానికి ఒకసారి బయట తినడం మంచింది.

నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయడం : నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయడం ఏప్రిల్ 1 నుంచి మరింత ప్రియం కానుంది. గతంలో 13.36 శాతంగా ఉన్న సేవా పన్ను ఇకపై 14 శాతంగా ఉండబోతుంది.

మొబైల్ బిల్లులు : మొబైల్ బిల్లులపై కూడా సేవా పన్నుని కేంద్ర బడ్జెట్ 2015లో అరుణ్ జైట్లీ పెంచిన విషయం తెలిసిందే. దీంతో సకాలంలో మొబైల్ బిల్లులు చెల్లించని పక్షంలో జరిమానా ఎక్కువగా విధించే అవాకాశం ఉంటుంది. మొబైల్ బిల్లులపై గతంలో 12.36 శాతంగా ఉన్న సేవా పన్ను ఇకపై 14 శాతంగా ఉండబోతుంది.

 సిమెంట్ : సిమెంట్‌పై ఎక్సైజ్ సుంఖం భారీగా పెంచడంతో సిమెంట్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో గతంతో పోలిస్తే ఈకాలంలో ఇల్లు కట్టడం మరింత భారంగా మారనుంది.

విమాన టిక్కెట్లు :  బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు మరింతగా పెరగనున్నాయి. వీటిపై ప్రస్తుతం ఉన్న 40 శాతం సేవా పన్ను ఈరోజు నుంచి 60 శాతానికి పెరుగుతుంది.

చౌక  :  మ్యూజియాలు, జంతు ప్రదర్శన శాలలు, జాతీయ పార్కులు, జంతు సంరక్షణ శాలల ప్రవేశ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు వరిష్ట పెన్షన్ బీమా యోజన, అంబులెన్స్ సర్వీసులు, కూరగాయలు, పండ్ల రిటైల్ ప్యాకింగ్ వంటి వాటిపైన కూడా సేవా పన్ను విధించలేదు.  ప్రభుత్వానికి సంబంధించిన చారిత్రక కట్టడాలు, నీటి పారుదల పనులు, తాగు నీటి సరఫరా, మురికి నీటి శుద్ది నిర్వహణ వంటి వివిధ నిర్మాణాత్మక సేవలకు సేవా పన్ను మినహాయింపు ఉంది.  రైలు, రోడ్డు మార్గాల్లో రవాణా చేసే ఆహార పదార్ధాలకు బియ్యం, పాలు, పప్పు ధాన్యాలు  పన్ను మినహాయింపు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: