ఆ బుడ్డోడు.. గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టాడు.. ఒక తాత ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. మరో తాత.. వెండితెరను ఏలుతున్న నట సింహం. తండ్రేమో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్షన్ ఉన్నవాడు. తల్లి ఓ బిజినెస్ ఉమన్.. మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టడం అదృష్టం కాక మరేమిటి.?

ఇప్పటికే ఈ బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థమైపోయింది కదా ఆ బుడ్డోడు ఎవరో.. ఐతే ఆ వీఐపీ పసివాడికి ఇప్పటి నుంచే భారీస్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్నారట. ఆ కుర్రాడికి నలుగురు గన్ మెన్లతో భద్రత ఏర్పాటు చేసినట్టు ఓ పత్రికలో వచ్చిన కథనం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ముఖ్యమంత్రి కుటుంబం కాబట్టి.. చంద్రబాబు కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణిలకు కూడా గన్ మెన్ల సెక్యూరిటీ ఉంటుంది. మామూలుగా ఐతే.. వీరికి వన్ ప్లస్ వన్ గన్ మెన్ భద్రత ఉందనీ.. కానీ లోకేశ్ కు కొడుకు పుట్టిన దగ్గర నుంచీ ఈ భద్రత పెంచారనీ ఆ కథనం చెబుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: