మన అందానికి ముఖ్యమైనది జుట్టు. జుట్టు అందంగా ఉంటే మని రూపాన్ని కూడా అందంగా పోల్చుతారు. ముఖ్యంగా మగువలకు కురులే అందం. ఈ కురులపై కవితలు కూడా కోకొల్లలు వచ్చాయి. అలాంటి జుట్టు ఈ మద్య కాలంలో నీటి ద్వారా, కాలుష్యం ద్వారా రాలిపోవడం జరగుతుంది. అసలు జుట్టు రాలిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరి వాటి విషయాల్లో జాగ్రత్త వహించాలి.


తల స్నానం చేసిన తరువాత బ్లో తో పొడిబారేటట్లు చేయడం తేలిక, సరైన పద్ధతి కాదు, కానీ అనేక అధ్యయనాలు ప్రతిరోజూ జుట్టుని బ్లోతో పొడిబారేటట్లు చేస్తే జుట్టు రాలడానికి దోహదపడుతుందని సూచించాయి. స్త్రైట్నింగ్, కర్లింగ్ వంటి ఇతర స్టైలింగ్ చికిత్సలు తరచుగా చేస్తే, మీ జుట్టుదువ్వే దువ్వేనపై కొన్ని అదనపు వెంట్రుకలు పోగవుతాయి.


 వేగవంతమైన, తీవ్రమైన జీవన శైలి మీ శక్తిని బైటికి పంపి వత్తిడి స్థాయిలను పెంచుతుంది. ఎక్కువ శాతం ప్రజలు వొత్తిడిని నిరోధించలేక పోవడం వల్ల ఎక్కువ జుట్టును పోగొట్టుకుంటు న్నారు, కానీ తప్పనిసరిగా బట్టతలకు ఒక్క ఒత్తిడి మాత్రమె కారణం కాదు.

 

కుటుంబంలో బట్టతల ఉంటె, మీరు ఏమి చేసినా దీనిని చక్కదిద్దలేరు. మీరు సరైన ఆహరం, జీవనశైలిని అనుసరించడం ద్వారా ఎక్కువ జుట్టును కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చు, కొన్ని పనులు చేయకపోవడం వల్ల కూడా వేగంగా జుట్టు రాలడానికి దోహదపడుతుంది.


కుటుంబంలో ఎవరికైనా బట్ట తల ఉంటే ...

 

హార్మోన్ల మార్పువల్ల: ముఖ్యంగా గర్భం దాల్చినపుడు, ప్రసవ సమయంలో హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల అధిక స్థాయిలో వెంట్రుకలు రాలడం జరుగుతుంది. థైరాయిడ్ లో హెచ్చుతగ్గులు, మేనోపాస్, ఇతర హార్మోన్లకు సంబంధించిన పరిస్థితులు కూడా జుట్టు రాలడానికి కారణాలు కావచ్చు .

 

గర్భం దాల్చినపుడు తలెత్తే సమస్యలు కారణంగా జుట్టు రాలిపోతుంది.


రసాయన ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం: షాంపూలు, కండిషనర్లు, జుట్టు నూనెలు ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో మీ జుట్టును విసిగింప చేస్తాయి, ఇవి అనేక రసాయనాలతో నిండి ఉంటాయి. జుట్టు కుదుళ్ళు బలహీనపడడానికి, జుట్టు చివర్లు విడిపోయే, జుట్టు రాలే, ఇంకా అనేక ఇతర జుట్టుకు సంబంధించిన విషయాలకు దోహదపడే హానికరమైన రసాయనాలు కలిగిఉండే సౌందర్య ఉత్పత్తులను మనం కొనుగోలు చేస్తున్నాము.


జంక్ ఫుడ్: పోషకాహార లోపలకు దోహదపడే జంక్ ఫుడ్ తీసుకోవడం బట్టతలకు దారితీస్తుంది. ప్రజలు ఒక పద్ధతి లేకుండా తినడ౦ వల్ల కూడా జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది.


జంగ్ ఫుడ్స్

 

మీ కార్యాలయంలో, మీ ఇంటిలో ఉండే ఎయిర్ కండిషనర్ సౌకర్యవంతమైనది, అనుకూలమైనది, అనుకూలమైన విధంగా ఉంటుంది, కానీ అది మీ జుట్టుకు సరైనది కాదు. పెళుసైన, నష్టపోయే అవకాశం ఉండడంతో జుట్టు ఏ వాతావరణ మర్పులకైన తీవ్రంగా స్పందిస్తుంది. మీ జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఇటువంటి పరిస్థితులను నివారిచడమే మంచి మార్గం.

 

జెండర్: జుట్టు రాలడం, బట్టతల అనేవి మగ, ఆడ ఇద్దరిలో ఉన్నప్పటికీ, మహిళలు ఒకే విధానంలో జుట్టును కోల్పోతారు - తల చుట్టూ, పురుషులు ఒక ప్రత్యేకమైన (కేశాలు నెమ్మదిగా తగ్గుతుండడం) నమూనాలో జుట్టును కోల్పోతారు. సాధారణంగా పురుషులకు సంభవించే రోగనిరోధక పరిస్థితుల వల్ల కూడా బట్టతల వస్తుందని భావిస్తారు


మరింత సమాచారం తెలుసుకోండి: