సెల్ ఫోన్.. ఇది మానవ శరీరంలో ఓ భాగంగా తయారైపోయిన రోజులివి.. ఫోన్ కనిపించకపోతే.. ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేని పరిస్థితికి అంతా చేరుకుంటున్నారు. ఇక చేతిలో ఉన్నది స్మార్ట్ ఫోనైతే.. చెప్పే పనేలేదు. ఇక వేరే ఎవరితోనూ అవసరమే లేదు. 

స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఏ చిన్న ఫీలింగ్ అయినా.. సరే వెంటనే.. ఓ ఫోటో తీసో.. కామెంట్ పెట్టో ప్రపంచంతో పంచుకోవాలనే పిచ్చి ఎక్కువవుతోంది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర యాప్ లతో జనం నిరంతరం టచ్ లో ఉంటున్నారు. 

ఐతే.. స్మార్ట్ ఫోన్ తో లాభాలే కాదు.. ఇబ్బందులూ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను అదే పనిగా వాడుతున్నవారు.. కుటుంబ జీవితంలో ఇబ్బందులు తప్పవని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ విపరీతంగా వాడేవారు.. మెల్లమెల్లగా ఒంటరి జీవితంలోకి నెట్టబడుతున్నట్టేనట. 

ఎవరైతే స్మార్ట్‌ఫోన్‌ను మోతాదుకు మించి అదేపనిగా వాడుతారో వారు ఒంటరయ్యే ప్రమాదముందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. లండన్‌కు చెందిన యూనివర్సిటీ ఆప్ డెర్భీ ఈ పరిశోధన నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా వాడే వారు..  స్తబ్ధుగా తయారవుతున్నారట. అంతేకాదు. అసూయతో కూడిన ఒంటరితనానికి అలవాటు పడతున్నారని ఈ పరిశోధన చెబుతోంది. అందుకే స్మార్ట్ ఫోన్ తో కాస్త జాగ్రత్త..


మరింత సమాచారం తెలుసుకోండి: