భూ సేకరణ ఆర్డినెన్స్ పై పోరుబాటకు రెడీ అయ్యింది కాంగ్రెస్. ఆదివారం హస్తిన సాక్షిగా భారీ ర్యాలీకి ప్రిపేర్ అవుతోంది. హైకమాండ్ చేస్తున్న ఫైట్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఢిల్లీకి పయనమయ్యారు స్టేట్ నేతలు. మోడీ సర్కార్ పై తొలి ప్రజా వ్యతిరేక ర్యాలీ కావడంతో నేతలందరూ రాజధాని బాట పట్టారు.

మొదట్లో వెయ్యి మందితో ర్యాలీకి వెళ్తే సరిపోతుందని రాష్ట్ర నాయకులు లెక్కలేసుకున్నారు. అయితే ర్యాలీలో రాహుల్ పాల్గొంటుండటంతో పార్టీ అరేంజ్ చేసిన వాహనాలే కాకుండా స్వచ్చందంగా హస్తినకు వెళ్తున్నారు లీడర్లు. జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ముఖ్యనేతలు ఇవాళ సాయంత్రం ప్లైట్ ఎక్కనున్నారు.  ప్లైట్ టిక్కెట్స్ దొరక్క  పోయినా ట్రైన్లు, బస్సులతో సర్దుబాటు చేసుకోవాలని రెడీ అయ్యారు.


రాహుల్ గాంధీకి ఏఐసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబోతున్నారన్న వార్తలతో ర్యాలీలో రాహుల్ ను కలిసేందుకు ఇదో బెస్ట్ చాయిస్ గా భావిస్తున్నారు స్టేట్ నేతలు. ఏదో విధంగా యువరాజు దృష్టిలో పడేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ర్యాలీలో కేవలం సోనియా, రాహుల్ గాంధి ప్లేక్సిలు జెండాలు ప్రదర్శించే ఛాన్స్ ఉన్నా తమ బలాన్ని కూడా చూపేట్టాలని చూస్తున్నారు జిల్లా స్థాయి నేతలు.

ర్యాలీ సక్సెస్ చేసి మోడీ సర్కార్ పై మరింత ఒత్తిడి పెంచాలని చూస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇదే స్పూర్తితో స్టేట్ లోనూ కొత్త కార్యక్రమాలకు ప్లాన్ చేయాలని చూస్తున్నారు నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: