రాష్ట్ర రాజధానిలో మరో చిన్నారి కామాంధునికి బలైంది. మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పపడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులే చెప్పారు. అంతే కాదు రాష్ట్రలో షీ టీమ్ ని కూడా ప్రవేశ పెట్టారు. కానీ మహిళలను, చిన్నారులను ఈ కామాంధుల నుంచి రక్షించలేక పోతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఏమాత్రం  కూడా లక్ష్యపెట్టకుండా నేరగాళ్లు, మగమృగాళ్లు ఆకృత్యాలకు తెగబడుతున్నారు. రాజధాని నగరంలోని ఖర్జానా ప్రాంతంలో పాత మట్టికోట సమీపంలో అభం శుభం తెలయని తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై మగమృగం పాశవికంగా అత్యాచారం చేశాడు.. చాక్కెట్లు, బిస్కెట్లు కోని ఇస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లిన కామాంధుడి కోరికకు పాపం ఫుణ్యం ఎరుగని బాలిక బలైంది.  


ఆటో డ్రైవర్ అయిన తన తండ్రి సైకిల్ పై టీ అమ్మే స్థానికంగా నివసించే మారుతి, అలియాస్ మారోటి తేజే రావు (31) తో స్నేహం ఏర్పడింది. తరుచుగా వారి ఇంటికి రావడం, అమ్మాయితో కాలక్షేపం కూడా  చేసేవాడు. అడదీ అని తెలిస్తే చాలు చిన్నా పెద్దా అనే భేదాలు లేకుండా ఉచ్ఛ నీచాలు వదిలేసి కామపిశాచుల్లా తయారైతారు. తేజేరావుకు కూడా అలాగే తయారయ్యాడు. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారిని చూసి కోర్కెలు గుర్రాలు కావడంతో ఆ అమ్మాయికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక తల్లి కూడా పరిచయస్తుడే కావడంతో ఏమీ అనలేక పోయింది.


తన రూమ్ కు తీసుకెళ్లిన కామాందుడు చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. రాత్రి తమ ఇంటికి బాలిక తిరిగి వచ్చి జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మారుతి అలియాస్ మారోటి తేజిరావుపై 376 సెక్షన్ తో పాటు బాలికలపై లైంగిక వేదింపుల నిరోధం సెక్షన్ కింగ కూడా కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: