ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొదటి మహిళ డ్రైవర్ గా తెలంగాణ నల్గొండ జిల్లా కు చెందిన సరితను నియమించారు. రాజధానిలో ఇప్పటి వరకు   మహిళలు ఆటోలు, క్యాబ్లు డ్రైవింగ్ చేయడం మనకు తెలుసు మొట్టమొదటి సారిగా ప్రభుత్వ రవాణా బస్సు ఒక మహిళను నియమించడం దేశానికే గర్వకారణం అంటున్నారు. మేము సైతం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారనడానికి తాజా ఉదాహరణ ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి తొలి మహిళా డ్రైవర్  గా ఎంపిక కావడం విశేషం.


డ్రైవింగ్ సీట్ పై కూర్చున్న సరిత

Telangana Native Becomes DTC's First Woman Driver

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందిన పేదరైతు కుటుంబంలో పుట్టిన సరితను మగపిల్లలు లేకపోవడంతో తండ్రి ఆమెను అబ్బాయిలా పెంచారు తల్లిదండ్రులు.అంతే కాదు సరిత చిన్న నాటి నుంచి తన హెయిర్ స్టయిల్, తన డ్రెస్సింగ్ స్టయిల్ మగవారిలా మెయిటేయిన్ చేసేదట. తన నాన్న ఇష్టంతో అంటున్న సరిత మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చెప్పాలన్నదే తన ఉద్దేశ్యమని చాలా ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు. ఇక్కడ బస్సు నడపటం కత్తిమీద సామే అయినప్పటికీ నల్లొండలో ఆటోను, హైదరాబాద్ లో కాలేజీ మినీ బస్సు నడిపిన అనుభవం బాగా ఉపయోగపడుతోందంటున్నారు. ఢిల్లీలో ప్రజారవాణా వ్యవస్థ అయిన డీటీసీలో మహిళా బస్సు డ్రైవర్లు కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. ఐదు అప్లికేషన్స్ పూర్తిగా పరిక్షించిన తర్వాత ఫిట్ మెంట్ ప్రకారం మరియు హెల్త్ చెకప్ చేసిన తర్వాత సరితను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.   నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుని.. డ్రైవర్ గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో సరోజిని నగర్ డిపోలో పోస్టింగ్ ఇస్తూ డీటీసీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: