హైదరాబాద్ శివారులలో భారీ గా బోగస్ ఓట్లు ఉన్నట్లు అదికారులు గుర్తిస్తున్నారు. ఒక్క మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో ఆరు లక్షలకు పైగానే బోగస్ ఓట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆదార్ కార్డుతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేస్తున్నప్పుడు ఈ విషయం వెల్లడవుతోంది. గత ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఆంద్ర,ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఆన్ లైన్ లో ఓట్లను నమోదు చేసుకున్నారని,అనేక మంది తప్పుడు చిరునామాలు ఇచ్చారని చెబుతున్నారు. ఆధార్ కార్డు ప్రకారం ఓటర్ల జాబితాను వెరిఫై చేస్తుంటే అనేక లొసుగులు బయటకు వస్తున్నాయి.కొందరు రెండు,మూడు చోట్ల ఓటర్లుగా నమోదు అయ్యారు.మరికొందరు అటు ఎపిలోను, ఇటు తెలంగాణలోను ఓట్లు పొందారు.రెండు వేర్వేరు తేదీలలో ఎన్నికలు జరగడంతో వీరు రెండు చోట్ల ఓట్లు వేశారని వెల్లడవుతోంది.కొన్ని ఇళ్లలో వాస్తవానికి ఐదారుగురు కూడా నివసించకపోయినా, ముప్పై నుంచి నలభై మంది ఓటర్లుగా నమోదు అయినట్లుగా బయటపడిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: